ఉత్తర రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
===లక్ష్మణుడి యోగ సమాధి===
[[File:Lava and Kusa, the sons of Rāma..jpg|thumb|రాముని కుమారులైన లవ కుశులు]]
రాముడు యముని వడి వడిగా పంపి దుర్వాసునికి ఎదురేగి స్వాగతించాడు. దుర్వాసుడు తనకు ఆకలిగా ఉన్నదని మృష్టాన్నం కావాలనీ కోరాడు. ఆయనను కోరిక మేరకు తృప్తి పరచి తాను యముడికి ఇచ్చిన మాటను గుర్తుతెచ్చుకొని విచారించసాగాడు. లక్ష్మణుడు వచ్చి" అన్నా! నీవు మాట తప్పవద్దు. ఏ సంకోచమూ లేకుండా శిక్ష విధించి ధర్మాన్ని నిర్వర్తించు" అని ధైర్య చెప్పాడు. రాముడు నిలువెల్లా కుంగిపోతూ వశిష్ట, భరత , [[శతృఘ్నుడు|శతృఘ్నులను]] సమావేశ పరచి విషయం విని విచారించాడు. [[వశిష్టుడు]] " రాజా! ఆడి తప్ప రాదు. నీవు లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధించు." అన్నాడు. " సాధు పరిత్యాగం మరణసమానమవుతుంది కనుక నిన్ను బహిష్కరిస్తున్నాను." అన్నాడు. వెంటనే సౌమిత్రి తన ఇంటి వైపు కూడా చూడక సరాసరి సరయూ నది ఒడ్డువద్దకు చేరి యోగసమాధి అయ్యాడు. ఇంద్రుడు తన విమానంలో అతన్ని [[అమరావతి]]కి తీసుకుకుపోయాడు. విష్ణు అంశలో నాల్గవభాగం తమ దగ్గరకు వచ్చినందుకు దేవతలు సంతోషించారు.
 
 
లక్ష్మణుడికి దేశ బహిష్కారం చేసాక భరతుని రాజుగా చేసి తాను కూడా వెళ్ళి పోతానని ప్రకటించాడు శ్రీ రాముడు. ఈ మాట విని యావత్తు రాజ్యం దుఃఖించింది. భరతుడయితే మూర్చపోయాడు. కొంతసేపటికి తేరుకొని భరతుడు" అన్నా! నువ్వులేని రాజ్యం నాకెందుకు? నిన్నువదిలి నేనుండలేను. కోసల రాజ్యం రెండుభాగాలు చేసి దక్షిణం [[కుశుడు|కుశుడికి]] ఉత్తరం [[లవుడు|లవుడుకి]] ఇచ్చేద్దాం. ఇదే ధర్మబద్ధం . వెంటనే శతృఘ్నునికి కబురుపెడదాం. " అన్నాడు. వరసగా జరుగుతున్న ఘటనలు ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించాయి. వశిష్టుడు " రామా! ప్రజల అభీష్టాన్ని కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి"" అన్నాడు. రాజు ప్రజలతో సభ జరిపి "నా నిర్ణయం రాజ్యాన్ని త్యజించి పోవడం. మీ నిర్ణయం ఏమిటి?" అని అడిగాడు. "ప్రభూ మీ నిర్ణయమే మాకు శిరో ధార్యం. తమతో పాటు అనుసరించాలని మాలో చాలా మందికి ఉన్నది. అందుకు అనుమతించండి. అదే మాకోరిక" అన్నారు. రాముడు సరేనన్నాడు.
 
===రాముని నిర్ణయం===
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_రామాయణం" నుండి వెలికితీశారు