జమలాపురం కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''సర్దార్ జమలాపురం కేశవరావు''' ([[1953]], [[మార్చి 30]]) [[హైదరాబాదు]] రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ తొలి అధ్యక్షుడు. తన కడుపు నిండిందా లేదా అన్నది ఆయనకు ప్రధానం కాదు. ఎదుటి వాడు తిన్నాడా లేదా అన్నదే ఆయనను నిత్యం వేధించిన ప్రశ్న! ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించారు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’గా పిలుచుకుంటారు. ఆయనే జమలాపురం కేశవరావు.
 
నిజాం సంస్థానంలో తూర్పు భాగాన ఉన్న ఖమ్మం (నాటి వరంగల్ జిల్లా)లోని ఎర్రుపాలెంలో 1908 సెప్టెంబర్ 3న జమలాపురం వెంకటరామారావు, వెంకటనరసమ్మలకు పుట్టిన తొలి సంతానం కేశవరావు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు కేశవరావును ఎంతగానో కలవరపరచాయి. ఎర్రుపాలెంలో ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆరడుగుల ఆజానుబాహువైన కేశవరావు, ఎత్తుకు తగ్గ దృఢమైన శరీరం, చెరగని చిరునవ్వుతో నిండుగా కనిపించేవారు. నిజాం పాలనలో కొనసాగుతున్న వెట్టి చాకిరితో అష్టకష్టాలకు గురవుతున్న ప్రజలను చూసిన కేశవరావు చలించిపోయారు. దాన్నుంచి ప్రజలను విముక్తం చేయడానికి తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కేశవరావు కాలినడకన విస్తృతంగా పర్యటించారు.
 
 
ఆ క్రమంలోనే భారత స్వాతంత్య్రోద్యమం పట్ల, గాంధీ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు. 1923లో రాజమండ్రిలో మొదటిసారి గాంధీ ఉపన్యాసాన్ని విన్న కేశవరావు, 1930లో విజయవాడలో జరిగిన సభలో గాంధీ పరిచయంతో మరింత ఉత్తేజితుడైనాడు. ఆంధ్రపితామహుడుగా ప్రఖ్యాతిగాంచిన మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గ్రంథాలయోద్యమాన్ని తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించారు. వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో కేశవరావు ముందుండేవారు. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రత్యేక శ్రద్ధను కనపరిచే వారు. 1938లో దీపావళి సందర్భంగా ఆవిర్భవించిన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్‌లో కేశవరావు ప్రముఖపాత్ర నిర్వహించారు. గోవిందరావు నానక్, జనార్దనరావు దేశాయ్, రావి నారాయణరెడ్డిలతో కలిసి నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ప్రచారం చేశారు.
 
1946లో మెదక్ జిల్లా కందిలో కేశవరావు అధ్యక్షతన జరిగిన 13వ ఆంధ్రమహాసభ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మాండమైన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్ర హం మరువలేనిది. దానికి బాధ్యుడైన కేశవరావుకు ప్రభుత్వం రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది. యావత్ భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో కేశవరావు వంటి నాయకులు నిర్భంధానికి గురికావడం ఒక విషాదం. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన తరువాత, 1952లో కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1953 మార్చి 29న 45 ఏళ్లకే సర్దార్ జమలాపురం కేశవరావు కన్నుమూయడం అందరినీ కంటతడి పెట్టించింది.
 
మార్చి 29న జమలాపురం కేశవరావు 58వ వర్ధంతి
 
{{తెలంగాణ విమోచనోద్యమం}}
"https://te.wikipedia.org/wiki/జమలాపురం_కేశవరావు" నుండి వెలికితీశారు