సూపర్ నోవా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
[[File:Progenitor IA supernova.svg|thumb|240px|వర్గం-Ia సూపర్నోవా పరిణామ క్రమం.

1. సాధారణ జంట నక్షత్రాలు 2.పెద్ద నక్షత్రం ముందు రెడ్ జైంట్ గా మారి.. 3. ..దానిలోని పదార్థాన్ని రెండవ నక్షత్రం పైకి విరజిమ్మి దాన్ని వ్యాకోచింపజేస్తుంది. 4.తేలికైన నక్షత్రం, రెడ్ జైంట్ కేంద్రం ఒక ఉమ్మడి పొరలో దగ్గరికి జరుగుతాయి. 5.ఉమ్మడి పొర నెమ్మదిగా దూరంగా జరుగుతుంది, రెండింటి మధ్యా దూరం కూడా తగ్గిపోతుంది. 6. రెడ్ జైంట్ మిగిలిన కేంద్రం కూడా సంకోచించి మరుగుజ్జు తారగా మారుతుంది. 7.రెండవ నక్షత్రం కూడా రెడ్ జైంట్ గా మారి మరుగుజ్జు తారపై పదార్థాన్ని విరజిమ్ముతుంది. 8. మరుగుజ్జు తార ద్రవ్యరాశి పెరుగుతూ ఉంటుంది, ఒక స్థాయిని దాటిన తర్వాత అది పేలిపోయి.. 9.రెండో నక్షత్రాన్ని దూరంగా విసిరేస్తుంది. ]]
ఈ సూపర్నోవాలు అనేక రకాలుగా ఏర్పడవచ్చు. కాని వాటన్నింటికి మూలాధార ప్రక్రియ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఒక కార్బన్-ఆక్సీజన్ మరుగుజ్జు నక్షత్రం చంద్రశేఖర్ పరిమితిని చేరుకోదగ్గ ద్రవ్యరాశిని (సూర్యుని ద్రవ్యరాశికి 1.38 రెట్లు) గ్రహించగలిగితే అది అంత ద్రవ్యరాశిని (ప్లాస్మా) ఎలక్ట్రాన్ వికర్షణ పీడనం ద్వారా నిలుపుకోలేక కుచించుకుపోతుంది. కానీ సాధారణంగా అవి ఆ పరిమితికి చేరుకోకముందే వాటి ఉష్ణొగ్రత, సాంద్రత పెరిగి నక్షత్రకేంద్రంలో కర్బన సంలీనం మొదలవుతుంది. కొద్ది క్షణలలోనే చెప్పుకోదగ్గ పరిమాణంలో పదార్థం సంలీనానికిలోనై నక్షత్రం పూర్తిగా పేలిపోయి సూపర్నోవాగా మారటానికి కావల్సినంత శక్తి విడుదల అవుతుంది. నక్షత్రంలోని పదార్థం ఒక అలజడి తరంగంగా, సెకనుకి 5000-20,000కి.మీ. (కాంతివేగంలో సుమారు 3%) వేగంతో బయటకి విసిరివేయబడుతుంది. అప్పుడు దానినుండి సూర్యునికి 5 బిలియన్ రెట్ల కాంతి వెలువడుతుంది. ఆ కాంతి నిజపరిమాణం 19.3 ఉంటుంది.

సాధారణంగా ఇది దగ్గరగా ఉండే జంట నక్షత్రాలలో జరుగుతుంది. జంట నక్షత్రాలలో పెద్దది ముందుగా నక్షత్ర పరిణామ క్రమంలో మారుతూ రెడ్ జైంట్ గా మారుతుంది. రెడ్ జైంట్ గా మారిన నక్షత్రం పై పొరలు విస్తరిస్తూ ఉంతాయి. కొంత కలానికి రెండు నక్షత్రలకి ఒకే ఉమ్మడి పొర ఉంటుంది. దానివల్ల వాటి అక్ష పరిభ్రమణ వ్యాసార్థం తగ్గిపోతుంది.
రెడ్ జైంట్ దాని పై పొరలను పూర్తిగా కోల్పోయి కొంతకాలానికి కేంద్రక సంలీనానికి ఇంధనం మిగలదు. అప్పుడు అది కార్బన్, ఆక్సీజన్ ఎక్కువగా ఉన్న మరుగుజ్జు నక్షత్రంగా మారుతుంది. తర్వాత రెండవ నక్షత్రం కూడా పరిణామ క్రమంలో రెడ్ జైంట్ గా మారుతుంది. అప్పుడు రెండవ రెడ్ జైంట్ నుండి మరుగుజ్జు నక్షత్రం పద్దర్థాన్ని గ్రహించి దాని ద్రవ్యరాశిని పెంచుకుని, సూపర్నోవాగా మారుతుంది.

రెండు మరుగుజ్జు నక్షత్రాలు కలిసిపోవటం వల్ల వాటి ఉమ్మడి ద్రవ్యరాశి కొన్ని క్షణాల పాటు చంద్రశేఖర్ పరిమితిని దాటడంవల్ల కూడా వర్గం-1a సూపర్నోవాగా మారుతుంది.
సూపర్నోవా పేలుడు తర్వాత కాలంతో పాటు మారే నక్షత్ర ప్రకాశం సాధారణ కాంతి వక్రాన్ని పోలి ఉంటుంది. ఈ ప్రకాశం నికెల్-56 రేడియో ధార్మిక క్షీణత వల్ల కోబాల్ట్-56గా, దాని నుండి ఐరన్-56 గా మారినప్పుడు వెలువడుతుంది.

===వర్గం-Ib,Ic===
[[Image:Supernova 2008D.jpg|thumb|SN 2008D, వర్గం-Ib<ref>
"https://te.wikipedia.org/wiki/సూపర్_నోవా" నుండి వెలికితీశారు