సూపర్ నోవా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
 
==విశ్వంపై సూపర్నోవా ప్రభావం==
===భారమూలకాల సృష్టి===
హైడ్రోజన్ కంటే భారమైన మూలకాలు ఏర్పడటానికి సూపర్నోవాలు ఒక ముఖ్య కారణం. ఈ మూలకాలు కేంద్రక సంలీనం ద్వారా ఐరన్-56, అంతకంటే తక్కువ భారం గల మూలకాలు, కేంద్రక సంయోగం ద్వారా ఐరన్ కంటే భారమైన మూలకాలను ఏర్పరుస్తాయి. సూపర్నోవా r-ప్రాసెస్ కి కూడా ఒక కారణం. అత్యధిక ఉష్ణొగ్రత, సాంద్రత, న్యూట్రాన్లు ఎక్కువగా ఉన్న పరిస్థితులలో కేంద్రక సంయోగం ద్వారా న్యూట్రాన్లు ఎక్కువగా ఉన్న అస్థిర పరమాణుకేంద్రకాలను ఏర్పరుస్తాయి. ఈ అస్థిర కేంద్రకాలు బీటా-కిరణ ఉద్గారం వల్ల స్థిరమైన కేంద్రకాలుగా మారతాయి. r-ప్రాసెస్ సాధారణంగా రెండవ వర్గం సూపర్నోవాలలో జరుగుతుంది. ఐరన్ తర్వాతి మూలకాలలో ప్లూటోనియం, యురేనియంతో సహా సగం మూలకాలను సృష్టిస్తుంది.<br\>
r-ప్రాసెస్ కాక ఇనుము కంటే భార మూలకాలను సృష్టించే మరో కారణం s-r-ప్రాసెస్. ఇది రెడ్ జైంట్లలో జరుగుతుంది. ఇది కాస్త నెమ్మదిగా మూలకాలను సృష్టిస్తుంది. కానీ ఇది సీసం కంటే భారమైన మూలకాలను సృష్టించలేదు.
"https://te.wikipedia.org/wiki/సూపర్_నోవా" నుండి వెలికితీశారు