న్యూట్రాన్ తార: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
రెండు సౌరద్రవ్యరాశులున్న న్యూట్రాన్ తార 10,970 మీటర్ల కంటే తక్కువ వ్యాసార్థం కలిగిఉండదు (AP4 పద్ధతి).దాని గురిత్వ బంధన శక్తి నిష్పత్తి 0.187, -18.7% (ఉష్ణమోచకం). ఇది 0.6/2 = 0.3, -30% కు దగ్గరగా లేదు.
<br\>న్యూట్రాన్ తార చాలా సాంద్రమైంది, ఒక దాని టీస్పూన్ పదార్థం (5మి.లీ) {{val|5.5|e=12|u=కి.గ్రా}} బరువుంటుంది, ఇది పిరమిడ్ గీజా కంటే 900ల రెట్లు ఎక్కువ. దానివల్ల ఏర్పడే గురుత్వశక్తి చాలా ఎక్కువ, ఒక మీటర్ పైనుండి న్యూట్రాన్ తార ఉపరితలం పైకి పడటానికి ఒక మైక్రోసెకండ్ మాత్రమే పడుతుంది, అదీ 2000కి.మీ/సె లేదా 7.2మిలియన్ కి.మీ/గం వేగంతో పడుతుంది. <br\>
<br\>అప్పుడే ఏర్పడ్డ న్యూట్రాన్ తార లోపల ఉష్ణోగ్రత 10<sup>11</sup> నుండి 10<sup>12</sup> కెల్విన్ ఉంటుంది.కానీ దాని నుండి పెద్ద సంఖ్యలో వెలువడే న్యూట్రినోలవల్ల అది శక్తిని కోల్పోయి కొన్ని సంవత్సరాలలోనే ఉష్ణోగ్రత 10<sup>6</sup>కు పడిపోతుంది. ఒక మిలియన్ కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద కూడా న్యూట్రాన్ తార నుండి వెలువడే శక్తి X-కిరణాల రూపంలోనే ఉంటుంది. న్యూట్రాన్ తారలు సాధారణ కాంతివర్ణపటంలో అన్ని భాగాలలో సమానమైన శక్తిని విడుదల చేస్తాయి, కాబట్టి తెల్లగా కనిపిస్తాయి.
<br\>న్యూట్రాన్ తార ఉపరితలం నుండి కేంద్రం వరకు పీడనం 0.3 to 16×10<sup>34</sup> వరకు పెరుగుతుంది.
<br\>న్యూట్రాన్ తార స్థితి సమీకరణం ఇప్పటి వరకూ కనుగొనబడలేదు. కానీ అది ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం వల్ల వివరించబడే అవనత వాయు స్థితి సమీకరణం కలిగి ఉండే మరుగుజ్జు నక్షత్రాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏమైనా, న్యూట్రాన్ తారలతో సాధారణ సాపేక్ష సిద్ధాంత ప్రభావాలను నిర్లక్ష్యం చేయ్యటం సాధ్యం కాదు. ఇప్పటికే ఎన్నో స్థితి సమీకరణాలు(FPS, UU, APR, L, SLy మొదలైనవి) ప్రతిపాదించబడ్డాయి, ప్రస్తుత పరిశోధనలు న్యూట్రాన్ తారలలోని పదార్థాన్ని ఊహించడానికి ప్రయత్నిస్తున్నాయి. న్యూట్రాన్ తారలలోని ద్రవ్యరాశికి, సాంద్రతకి సంబంధం పూర్తిగా తెలియనందున దాని వ్యాసార్థాన్ని ఖచ్చితంగా నిశ్చయించడం సాధ్యం కావట్లేదు. ఉదాహరణకి 1.5 సౌర ద్రవ్యరాశులున్న న్యూట్రాన్ తార వ్యాసార్థం 10.7, 11.1, 12.1 or 15.1 ఉండవచ్చు (వరుసగా FPS, UU, APR or L స్థితి సమీకరణాల ఆధారంగా). అన్ని స్థితి సమీకరణాలు న్యూట్రాన్ పదార్థం పీడనంతో పాటు సంకోచిస్తుందనే చెప్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/న్యూట్రాన్_తార" నుండి వెలికితీశారు