సిద్దేంద్ర యోగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
 
#===[[భామా కలాపం]]===
==రచనలు==
సిద్ధేంద్రయోగి అంతకుముందే భాగవతులచేత అనేక వేషాలు వేయించియున్నాడు. శ్రీకాకుళంలోని ఆంధ్రవిష్ణువు దేవాలయంలో దేవదాసీలు భగవంతుని సేవగా చేసే నృత్యాన్ని పరిశీలించియున్నాడు. ఉడిపిలో సంగీత, సాహిత్య అభినయాలను కూలంకషంగా అభ్యసించాడు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణతీర్ధులు సంస్కృతంలో రచించిన కృష్ణలీలా తరంగిణి, తెలుగులో రచించిన పారిజాతాపహరణమూ దక్షిణదేశంలో అప్పటికే ప్రచారంలో ఉన్నాయి. పారిజాతాపహరణం కథనే తెలుగులో "పారిజాతం" అనే పేరుతో నృత్యనాటికగా సిద్ధేంద్రయోగి రచించాడు. అదే "భామాకలాపం"గా ప్రసిద్ధి చెందింది. ఆ భామాకలాపాన్ని కూచిపూడిలోని బ్రాహ్మణుల పిల్లలకు బోధించాడు. కూచిపూడిలో పుట్టిన ప్రతిమగపిల్లవానికి సిద్ధేంద్రుని పేరుచెప్పి, ముక్కు కుట్టి, కాలిగజ్జె కట్టి, ఆ పిల్లవాడు పెద్దయ్యాక ఏ వృత్తిని అవలంబించినా గాని స్వామి సన్నిధిలో భామవేషం వేసి తీరాలని, స్త్రీలకు ఈ కళలో ప్రవేశం ఉండరాదని సిద్ధేంద్రుడు శాసించాడు. ఆ నియమం చాలాకాలంవరకూ కొనసాగింది. భామాకలాపం రచనావిధానం యక్షగానరీతిలో ఉన్నాగాని దాని ప్రదర్శన రీతి విశిష్టమైనది. భామాకలాపంలో నృత్యము, సంగీతము ప్రాధాన్యం వహిస్తాయి. ఇందులో నాయిక [[సత్యభామ]]. నాయకుడు [[కృష్ణుడు]]. చెలికత్తె మాధవి మరో ముఖ్యమైన పాత్ర. 'కలాపము' అంటే 'కలత' లేదా 'కలహము' అని అర్ధము.
#[[భామా కలాపం]]
 
#[[గొల్ల కలాపం]]
 
భామాకలాపము విఘ్నేశ్వరస్తుతితో (''శ్రీ విఘ్నేశ్వర పాదపద్మములనే సేవించి నా యాత్మలో'' అని)ఆరంభమవుతుంది. ఆ వెనుక సరస్వతీప్రార్ధన ఉంటుంది. వెన్నెలపదం పాడుతూ సత్యభామ ప్రవేశించడంతో కథ ఆరంభమవుతుంది. నేవెవరవు అని చెలికత్తె అడుగుతుంది. అప్పుడు సత్యభామ
<poem>
:భామనే సత్యభామనే
:భామరో శృంగార జగదభిరానే
:ముఖవిజిత హేమాధామనే
:ద్వారకాపురాఢ్యురామనే
:వయ్యారి సత్యాభామనే
</poem>
అనే దరువును పాడుతుంది. ఆ వెనుక అత్తమామల ప్రశస్తి చెప్పి, సత్యభామ హరి ఎక్కడున్నాడని అడిగి, అనంతరం భుదేవిని ప్రశస్తిస్తుంది. తరువాత దరువు, వెన్నెల పదము, మరికొన్ని దరువులు శ్రీకృష్ణునితో కలిసి పాడుతుంది. ఈ సందర్భంలోనే దశావతార వర్ణన సంవాదపూర్వకంగా సాగుతుంది. మంగళహారతితో భామాకలాపం ముగుస్తుంది.
 
కాలక్రమంగా భామాకలాపం కొన్నిమార్పులు పొందింది. సిద్ధేంద్రుని పారిజాతంలో తొలిఘట్టమే భామాకలాపం. అయితే అనంతర ప్రదర్శనలలో పారిజాతం కథను తీసివేసి, సత్యభామ అష్టవిధ కథానాయికలుగా అభినయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలా మార్పులు చేసినవారిలో ముఖ్యుడు [[పశ్చిమగోదావరి జిల్లా]]కు చెందిన [[ఆకివీడు]] వాస్తవ్యుడు [[మంగు జగన్నాధ పండితుడు]]. సిద్ధేంద్రునికి రెండువందల సంవత్సరాల తరువాతివాడు. తరువాత క్రమంగా మహిళలు భామాకలాపం ప్రదర్శనలో అగ్రగాములైనారు.
 
#===[[గొల్ల కలాపం]]===
 
సిద్ధేంద్రయోగి గొల్లకలాపాన్ని కూడా రచించాడు. కాని గొల్లకలాపము [[భాగవతుల రామయ్య]] రచన అని మరికొందరి అభిప్రాయము. (ఇది సిద్ధెంద్రయోగి రచన అనడంలో సందేహం లేదని డా. ఎన్. గంగప్ప తన రచనలో పేర్కొన్నాడు.) గొల్లకలాపంలో నాయిక రేపల్లెవాడలోని [[గొల్ల]]భామ. "చల్లోయమ్మ చల్ల" అంటూ గొల్లవనిత [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] పండితులతో వివాదంలో పడడం ఈ రచన ఇతివృత్తం. ఈ వివాదంలో మానవుని జననంనుండి మరణంవరకు, చల్లనుండి వెన్న తీయడం మొదలు [[త్రిమతాలు|జీవాత్మ పరమాత్మల సంబంధం]] వరకు మానవజీవితాన్ని గురించి, సృష్టిని గురించి చర్చిస్తారు.
 
==ఇతని గురించిన కథ==
"https://te.wikipedia.org/wiki/సిద్దేంద్ర_యోగి" నుండి వెలికితీశారు