భామా కలాపం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ జరుగుచున్నది
విస్తరణ జరుగుచున్నది
పంక్తి 9:
 
 
==వృత్తాంతము==
భామాకలాపం రచనావిధానం యక్షగానరీతిలో ఉన్నాగాని దాని ప్రదర్శన రీతి విశిష్టమైనది. భామాకలాపంలో నృత్యము, సంగీతము ప్రాధాన్యం వహిస్తాయి. ఇందులో నాయిక [[సత్యభామ]]. నాయకుడు [[కృష్ణుడు]]. చెలికత్తె మాధవి మరో ముఖ్యమైన పాత్ర. 'కలాపము' అంటే 'కలత' లేదా 'కలహము' అని అర్ధము.
 
Line 22 ⟶ 23:
అనే దరువును పాడుతుంది. ఆ వెనుక అత్తమామల ప్రశస్తి చెప్పి, సత్యభామ హరి ఎక్కడున్నాడని అడిగి, అనంతరం భుదేవిని ప్రశస్తిస్తుంది. తరువాత దరువు, వెన్నెల పదము, మరికొన్ని దరువులు శ్రీకృష్ణునితో కలిసి పాడుతుంది. ఈ సందర్భంలోనే దశావతార వర్ణన సంవాదపూర్వకంగా సాగుతుంది. మంగళహారతితో భామాకలాపం ముగుస్తుంది.
 
==మార్పులు==
కాలక్రమంగా భామాకలాపం కొన్నిమార్పులు పొందింది. సిద్ధేంద్రుని పారిజాతంలో'''పారిజాతం'''లో తొలిఘట్టమే భామాకలాపం. అయితే అనంతర ప్రదర్శనలలో పారిజాతం కథను తీసివేసి, సత్యభామ అష్టవిధ కథానాయికలుగా అభినయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలా మార్పులు చేసినవారిలో ముఖ్యుడు [[పశ్చిమగోదావరి జిల్లా]]కు చెందిన [[ఆకివీడు]] వాస్తవ్యుడు [[మంగు జగన్నాధ పండితుడు]]. సిద్ధేంద్రునికి రెండువందల సంవత్సరాల తరువాతివాడు. తరువాత క్రమంగా మహిళలు భామాకలాపం ప్రదర్శనలో అగ్రగాములైనారు.
 
 
మొదట్లో ఈ కలాపాలను కూచిపూడి భాగవతులు (మగవారు)మాత్రమే స్త్రీవేషాలు ధరించి ప్రదర్శించేవారు. తరువాత క్రమంగా మహిళలు భామాకలాపం ప్రదర్శనలో అగ్రగాములైనారు. క్రమంగా కళావంతుల మహిళలు కూడా కూచిపూడి విద్వాంసులవద్ద శిక్షణ పొంది ప్రదర్శనలు ఇవ్వసాగారు. అంతే గాకుండా కొందరు ఇతర రాష్ట్రాలవారూ, ఇతర దేశాలవారూ ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
 
సుమారు ఐదు వందల సంవత్సరాలక్రిందట ఆరంభమైన ఈ భామాకలాపం కళారీతి ప్రస్తుతం మూడు రీతులలో ప్రవర్ధిల్లుతున్నది. (1) కృష్ణ, గుంటూరు జిల్లాలలో ప్రచారంలో ఉన్న భామాకలాపం కూచిపూడి సంప్రదాయంపై ఆధారపడిఉన్నది. (2) పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో దేవదాసీలు ప్రచారం చేసిన శైలి లాస్యపద్ధతిపై ఆధారపడి ఉంది. (3) విశాఖ, గోదావరి జిల్లాలలో "ద్రుపద బాణీ" ప్రచారంలో ఉన్నది.
 
సిద్ధేంద్రుడురచించిన భామాకలాపమే కాఖుండా ప్రస్తుతం ఇతర రచయితల భామాకలాపాలు సైతం వారివారి బాణీలలో పాడడం జరుగుతూ ఉన్నది. మనదేశంలో ఇరవైవరకు భామాకలాపాలు ప్రచారంలో ఉన్నాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/భామా_కలాపం" నుండి వెలికితీశారు