ఆరుట్ల కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఆరుట్ల కమలాదేవి''' నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టి...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆరుట్ల కమలాదేవి''' నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది. వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించడమే కాకుండా ఉద్యమాలలొ కూడా భర్తతో పాటు పాల్గొంది. ఆంధ్రమహాసభలకు కూడా హాజరై ఉత్తేజాన్ని పొందింది. నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి జైలుకు వెళ్ళింది. 1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆలేరు నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికైనది.
"https://te.wikipedia.org/wiki/ఆరుట్ల_కమలాదేవి" నుండి వెలికితీశారు