వీరనరసింహ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
 
'''వీరనరసింహరాయలు''' విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి. తుళువ వంశ స్థాపకుడైన [[తుళువ నరస నాయకుడు | తుళువ నరస నాయకుని]] కుమారుడు. ఈయన అసలు పేరు కూడా తండ్రిలాగా నరస నాయకుడే, అయితే సింహాసనాన్ని మాత్రం '''వీర నరసింహ రాయలు''' అనే వీరోచిత పేరుతో అధిష్టించినాడు. ఇతని తండ్రి నరస నాయకుడు [[1503]]లో దివంగతుడైన తర్వాత వీరనరసింహరాయలు [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]] నందు బందీగా ఉన్న [[సాళువ రెండవఇమ్మడి నరసింహ రాయలు]] పేరుతో 1505 వరకు రాజ్యాన్ని పరిపాలించినాడు. కానీ [[1506]]లో అతనిని హత్యగావించి తనే రాజుగా సింహాసనాన్ని అధిష్టించాడు.
 
===సామంతుల తిరుగుబాట్లు===
పంక్తి 11:
 
వీరనరసింగ రాయలు మిగిలిన తిరుగుబాటు చేస్తున్న సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన [[శ్రీ కృష్ణదేవరాయలు]]ను రాజ్యపాలనకు నియమించి, [[1508]] నాటికి [[ఉమ్మత్తూరు]], [[శ్రీరంగపట్టణము]]లను ఓడించి విజయనగరము వచ్చినాడు, కానీ మరళా వీరు తోక జాడించినారు. దానితో ఈ సారి తన సోదరులగు [[అచ్యుత రాయలు]], [[శ్రీరంగ రాయలు]]ను సైన్యసమేతంగా సామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో [[కొంకణ]] ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించినాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు.
 
ఉమ్మత్తూరుపై యుద్ధంలో పోర్చుగీసు వారు గుఱ్ఱాలు, ఫిరంగులు సరఫరాచేసి రాయలకు సహాయం చేశారు. ప్రతిగా వీరు భట్కళ్ రేవుపై ఆధీనాన్ని పొందారు.
 
==దక్షిణ దండయాత్ర==
Line 18 ⟶ 20:
 
==వారసుడు==
దక్షిణ దేశ యాత్రలు తరువాత వీర నరసింగ రాయలు జబ్బు పడినాడు. దానితో తన వద్ద మహామంత్రిగా ఉన్న [[సాళువ తిమ్మరుసు]]ను పిలిపించి, తన తరువాత, తన ఎనిమి సంవత్సరాల కొడుకు [[తిరుమల రాయలు]]ను రాజ్యానికి వారసునిగా చేయమనీ, అలాగే [[శ్రీ కృష్ణదేవ రాయలు]] కను గుడ్లు పీకి చూపించమనీ ఆజ్ఞాపించాడు. కానీ తిమ్మరుసు ముందుగానే అనేక యుద్ధములందు శ్రీ కృష్ణదేవరాయల ప్రతాప సామర్ధ్యములు ఎరిగి ఉన్నందువల్ల ఆ పని చేయలేక విషయమంతా కృష్ణదేవ రాయలుకు చెప్పి అతనిని ప్రవాసం పంపించి, ఓ మేక కనుగుడ్లు తెచ్చి చూపించి రాజును అవసాన కాలంలో సంతృప్తి పరచాడుపరచాడని ఒక కథనం ఉన్నది. కానీ అన్నదమ్ముల మధ్య సౌభ్రాతృత్వం తప్ప వైరమున్నట్టు ఎలాంటి చారిత్రకాధారాలు లేవు. వీర నరసింహరాయలు [[1509]]లో మరణించినాడు. ఆ తరువాత కృష్ణదేవరాయల పట్టాభిషేకం ఎలాంటి గొడవలు లేకుండా సునాయాసంగా జరిగిపోయింది.
 
 
 
{{విజయ నగర రాజులు}}
"https://te.wikipedia.org/wiki/వీరనరసింహ_రాయలు" నుండి వెలికితీశారు