రామ రాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''ఆరవీటి రామ రాయలురామరాయలు''' (జ.[[1469]]<ref name=ram1>Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William J. Jackson పేజీ.210</ref>- మ.[[1565]]) (''Rama Raya'') [[శ్రీ కృష్ణదేవ రాయలు]] అల్లుడు, గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, చాలా కాలం 16వ శతాబ్ది రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించినాడు. విజయనగర రాజ వంశములలో నాలుగవది, చివరిదీ ఐన అరవీటి వంశమునకు ఆద్యుడు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున ఈయనను అళియ రామరాయలు ([[కన్నడము]]లో ''అళియ'' అంటే అల్లుడు) అని కూడా వ్యవహరిస్తారు. ప్రముఖ సంస్కృత పండితుడు రామామాత్యుడు రామరాయల ఆస్థానములో ఉండెడివాడు.
 
==తొలిదశ==
రామరాయలు ఆధునిక [[కర్నూలు జిల్లా]] ప్రాంతంలో 1484లో జన్మించాడు. రామరాయల తండ్రి శ్రీరంగరాజు విజయనగర రాజ్యంలో ప్రముఖ సేనాధిపతి. [[సాళువ నరసింహరాయలు]] సింహాసనానికి వచ్చేటప్పటికి రామరాయలు ఏడాది బాలుడు. 1505లో ఇరవై ఒక్క యేళ్ల వయసు వచ్చేసరికి విజయనగర సామ్రాజ్యం మూడు వంశాల చేతులు మారటంతోపాటు అధికారం కోసం జరిగే కరుడు రాజకీయాలు అనేకం చూశాడు. ఆ తరువాత ఏడేళ్లకే గోల్కండ సుల్తానుల సేవలో చేరాడు.<ref>[http://books.google.com/books?id=DNNgdBWoYKoC&pg=PA87&dq=rama+raya#v=onepage&q=rama%20raya&f=false A Social History of the Deccan, 1300-1761: Eight Indian Lives, Volume 1 By Richard M. Eaton]</ref> 1512లో సుల్తాను విజయనగర సామ్రాజ్యపు ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొన్నప్పుడు [[రాచకొండ]] కోటకు దుర్గాధిపతిగా ఆ ప్రాంతాన్ని పాలించడానికి రామరాయలను నియమించాడు. అయితే సుల్తానుల సేవలో రామరామలు అట్టేకాలం లేడు. 1515లో బీజాపూరు సుల్తాను రామరాయల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై దండెత్తినపుడు రామరాయలు కోటవిడచి గోల్కొండకు పారిపోయాడు. ఇది పిరికి పనిగా భావించిన గోల్కొండ సుల్తాను ఆయన్ను సేవలో నుండి తీసేశాడు. రాయరాయలు విజయనగరం తిరిగివచ్చి కృష్ణదేవరాయల సేవలో చేరాడు.
==పరిపాలన==
రామరాయలు శ్రీరంగరాజు, తిరుమలాంబల కొడుకు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో గొప్ప సేనాధిపతిగా, పరిపాలకునిగా, రాజకీయ తంత్రము తెలిసిన వాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మామ చనిపోయిన తరువాత రాజకార్యములలో తన ప్రభావము చూపాడు. 1529లో శ్రీకృష్ణదేవరాయల చిన్న తమ్ముడు అచ్యుతరాయలు సింహాసనమెక్కి 1542వరకు పాలించి చనిపోయాడు. పిమ్మట అతని మేనల్లుడు, బాలుడగు సదాశివరాయలు రాజయ్యాడు. రాజ్యాధికారమంతయూ రామరాయల చేతిలోనే ఉన్నది. సదాశివరాయని తొలగించి తానే రాజయ్యే అవకాశముందని కొలువులోని పెక్కుమందికి అనుమానము. కోశాధికారి, మహాయోధుడగు సలకము తిమ్మరాజు రామరాయలని హత్యచేయుటకు ఏర్పాటు చేస్తాడు. ఇది తెలిసి రామరాయలు గండికోట కు పారిపోయి అచట విజయనగరరాజ్యానికి విశ్వాసపాత్రుడగు పెమ్మసాని యెర్ర తిమ్మానాయుని ఆశ్రయము పొందుతాడు. తిమ్మరాజు పెద్ద సైన్యముతో గండికోట వచ్చి రామరాయలను అప్పగించమని తిమ్మానాయుని కోరతాడు. ప్రతిగా తిమ్మానాయుడు "మమ్ములను ఆశ్రయించిన వారిని రక్షించుట మా ధర్మము. మీతో పోరునకు మేము సిద్ధము" అని కబురంపుతాడు. గండికోట కు మూడు క్రోసుల దూరమున గల కోమలి వద్ద తిమ్మరాజుకు, యెర్రతిమ్మానాయునికి మధ్య భీకర యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధములో విజయనగర సేన ఓడిపోతుంది. తిమ్మానాయుడు, రామరాయలు తిమ్మరాజుని విజయనగరము వరకు తరిమి చంపుతారు. ఈ యుద్ధపరిణామముగా రామరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతి అవుతాడు<ref>కోమలి వద్ద యుద్ధం: http://books.google.co.in/books?id=FqLfdZ0gcoEC&pg=PA184&dq=gandikota&lr=#PPA184,M1</ref>.
"https://te.wikipedia.org/wiki/రామ_రాయ" నుండి వెలికితీశారు