ఇబ్రాహీం కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
'''ఇబ్రహీం కులీ కుతుబ్‌షా వలీ''' [[గోల్కొండ]]ను పాలించిన కుతుబ్‌షాహీ వంశానికి చెందిన మూడవ నవాబు. ఈయన 1550 నుండి 1580 వరకు గోల్కొండను పరిపాలించాడు.
 
1543లో ఇబ్రహీం సోదరుడు, [[జంషీద్ కులీ కుతుబ్ షా]], తండ్రిని చంపి, సోదరుని కళ్ళు పీకేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. పద్నాలుగేళ్ల వయసులో [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]], దేవరకొండ కోట నుండి తప్పించుకొని [[విజయనగర సామ్రాజ్యము|విజయనగరానికి]] పారిపోయి [[రామ రాయలు|రామరాయల]]ను ఆశ్రయించి, అక్కడ ఏడేళ్ల పాటు రాజ అతిధిగా జీవించాడు.<ref>[http://books.google.com/books?id=v4UKJFLZVcEC&dq=ibrahim+vijayanagar&q=ibrahim#v=onepage&q=ibrahim%20vijayanagar&f=false Mohammad Quli Qutb Shah, Volume 216 By Masʻūd Ḥusain K̲h̲ān̲]</ref> రామరాయలు ఇబ్రహీం కులీకి ఒక జాగీరును కూడా ఇచ్చాడు. రామరాయల భార్య ఈయన్ను సొంత కొడుకుగా భావించి షెహజాద్ అని పిలిచేది. విజయనగరంలో ఉండగా [[తెలుగు భాష]]పై అభిమానం పెంచుకున్నాడు. తరువాత తన పాలనాకాలంలో తెలుగు భాషను ఆదరించి, కవులను పోషించాడు. జంషీద్, ఆ తరువాత ఆయన కొడుకు సుభాన్ చనిపోయిన తర్వాత, ఇబ్రహీం గోల్కొండకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేపట్టాడు.
 
కళాపోషకుడిగా ఇబ్రహీం సభలో అనేకమంది కవులకు ఆశ్రమమిచ్చాడు. అందులో [[సింగనాచార్యుడు]], [[అద్దంకి గంగాధరుడు]] మరియు [[కందుకూరి రుద్రకవి]] మొదలైనవారు ప్రసిద్ధులు. అద్దంకి గంగాధరుడు తను వ్రాసిన తపతీ సంవరణోపాఖ్యానమనే ప్రబంధ కావ్యాన్ని ఇబ్రహీం కులీకి అంకితమిచ్చాడు. ఈయన్ను తెలుగు కవులు ''మల్కీభరాము'', ''ఇభరాముఅభిరామ'' గా అని వ్యవహరించేవారు. సాంప్రదాయంగా వస్తున్న అరబ్బీ మరియు పారశీక కవులతో పాటు తెలుగు కవులను కూడా పోషించాడు. ఇబ్రహీం కులీ ప్రజా సంక్షేమంపై శ్రద్ధవహించాడు. అప్పటివరకు ఇటుకలు, మట్టితో కట్టి ఉన్న గోల్కొండ కోటను రాళ్లు, సున్నంతో కట్టించి కోటను ధృడపరిచాడు. తన అల్లుడు హుస్సేన్ వలీ ఖాన్ పేరు మీద [[హుస్సేన్ సాగర్]] సరస్సును నిర్మింపజేశాడు మరియు ఇబ్రహీంభాగ్ ను అభివృద్ధి పరచాడు. గోల్కొండ కోటలోని మక్కీ దర్వాజాపై చెక్కబడిన ఒక శాసనంలో అత్యంత మహోన్నతమైన చక్రవర్తిగా కీర్తించబడ్డాడు. ఇబ్రహీం కులీ షియా మతస్థుడైనా పరమతసహనం పాటించాడు.
 
ఇబ్రహీం కులీ, భాగీరథి అనే తెలుగు వనితను వివాహమాడినాడు. 1565లో [[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ]] సుల్తానులతో కలిసి సమైఖ్యంగా విజయనగర సామ్రాజ్యంపై యుద్ధం చేశాడు. [[తళ్ళికోట యుద్ధం]]లో యవ్వనంలో తనకు ఆశ్రయమిచ్చిన ఆళియ రామరాయలును స్వయంగా సంహరించినట్లు భావిస్తారు. కొంతకాలం అస్వస్థత తర్వాత ఇబ్రహీం కులీ 1580లో మరణించాడు.
 
==వారసుడు==
1580లో ఇబ్రహీం కులీ చనిపోయేనాటికి ఆరుగురు కుమారులు జీవించి ఉన్నారు. అందులో పెద్దవాడు అబ్దుల్ ఖాదిర్, రెండవ యువరాజు హుస్సేన్ కులీ ఇరవై యేళ్ల వయసువాడు. హుస్సేన్ కులీ చక్రవర్తి కావటానికి మీర్ జుమ్లా తాబా తాబా వంటి అనేకమంది శక్తివంతమైన సేనానులు మద్దతు ప్రకటించారు. అయితే రాయరావు ఆధ్వర్యంలో ఒక దక్కనీ సేనానుల వర్గం, ఒక పన్నాగం ప్రకారం మూడవ కుమారుడైన మహమ్మద్ కులీని సింహాసనమెక్కించారు. అప్పటికీ మహమ్మద్ కులీ వయసు పదిహేనేళ్లే. మహమ్మద్ కులీ హిందూ తల్లి పుట్టినందున రాయరావు మద్ధతిచ్చి ఉండవచ్చు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==