ఎలగందల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
[[దస్త్రం:Masjid on elgandal galleryfull.jpg|thumb|right|200px|ఎలగందల్ కోటలోని మసీదు]]
[[దస్త్రం:Masjid on elgandal 2 galleryfull.jpg|thumb|right|200px|ఎలగందల్ కోటలోని మసీదు ముందు వైపు నుండి]]
ఎలగందల్లో ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే [[ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ]] వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. టర్కీ మరియు ఫ్రెంచి ఇంజనీర్ల ప్రభావం వళ్ళ ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా ఖండపు కోటలతో పోలి ఉన్నది.<ref>[http://books.google.com/books?id=zettAAAAMAAJ&q=elgandal+fort&dq=elgandal+fort Journal of the Andhra Historical Research Society, Volume 35]</ref> ఈ గిరిదుర్గాన్ని తొలుత కాకతీయులు కట్టించారు. ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మానాకొండూరు గ్రామానికి సొరంగమార్గమున్నదని ప్రతీతి.<ref>[http://www.hindu.com/2010/11/18/stories/2010111853140300.htm Wild bears make Elgandal Fort their home - The Hindu]</ref> కరీంనగర్ గ్రామాన్ని స్థాపించిన సయ్యద్ కరీముద్దీన్ ఎలగందల్ కోటకు ఖిలాదారుగా పనిచేశాడు.<ref>[http://books.google.com/books?id=w9pmo51lRnYC&pg=PA180&dq=elgandal#v=onepage&q=elgandal&f=false Encyclopaedia of the Hindu World: A-Aj, Volume 1 edited by Gaṅgā Rām Garg]</ref> 1905 వరకు జిల్లా యొక్క పాలనా యంత్రాంగమంతా ఎలగందల్ కోట నందే కేంద్రీకృతమై ఉండేది.
 
మానేరు నదీతీరంలో తాటిచెట్ల మద్య సుందర ప్రకృతిక నేపధ్యంలో యలగందల్ కోట నిర్మించబడి ఉంది. కోటకు ఒకవైపు మానేరు నది, మరోవైపు ఎలగందల్ గ్రామం ఉన్నాయి. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గిరి దుర్గం ఆ తరువాత బహుమనీలు, కుతుబ్‌షాహీలు, ఇమాద్ షాలు, అసఫ్‌జాహీల పాలనలో జిల్లా యొక్క రాజకీయాలకు కేంద్రబిందువైంది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరస్సు 1774లో జాఫర్ ఉద్దౌలా చేత నిర్మించబడింది. ముస్లిం సన్యాసులైన సయ్యద్ షా మునావర్ ఖాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్ మరియు వలీ హైదర్ సాహెబ్ల సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. హైస్కూలు వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.
 
;దో మినార్
ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది. ఇది ముస్లింలు పండగ రోజుల్లో ప్రార్ధన చేసే ఈద్‌గా. దీనిని బహమనీ సుల్తానులు నిర్మించారు. దీని పైకి వెళ్ళడానికి లోపలి నుండి మెట్లు వుంటాయి.
 
==రవాణా సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/ఎలగందల్" నుండి వెలికితీశారు