బాల్ ఠాక్రే: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fr:Bal Thackeray
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| source =
}}
మరాఠీలా ఆరాధ్యదైవంమ్<ref>ఈనాడు దినపత్రిక, తేది 18-11-2012</ref>, [[శివసేన పార్టీ]] వ్యవస్థాపకుడైన బాల్ థాకరే(బాలాసాహెబ్‌ థాక్రే) [[జనవరి 23]], [[1926]]న పూనేలో జన్మించాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు [[మహారాష్ట్ర]] రాజకీయాలలో కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన విలక్షణ వ్యక్తి బాల్ థాకరే. 1950లలో రాజకీయ వ్యంగచిత్రకారుడిగా (కార్టూనిస్టుగా) జీవనం ప్రారంభించిన థాకరే 1960 నాటికి సొంత రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు. [[ముంబాయి]]లో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవాడు. ఆ తర్వాత మరాఠా ప్రజల హక్కుల సాధనకై పోరాటం చేయడానికి 1966లో శివసేన పార్టీకి ఏర్పాటుచేశాడు. "మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే' అనే ఉద్యమంలో భాగంగా ముంబాయిని వదిలిపోవాలని ప్రవాసులను హెచ్చరించాడు. హిందూత్వను, హిందూ జాతీయవాదాన్ని కూడా బలపర్చినాడు. జాతీయ రాజకీయాలలో [[భారతీయ జనతా పార్టీ]]తో జతకట్టి కీలక పాత్ర వహించాడు. శివసేన పార్టీ స్థాపించిననూ 1995లో మహారాష్ట్రలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిననూ బాల్ థాకరే మాత్రం ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేడు, ఎన్నికలలో పోటీచేయలేడు. పార్టీ అధినేతగానే ఉంటూ పార్టీని నడిపించాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకంజ వేయలేడు. 86 ఏళ్ళ వయస్సులో [[నవంబరు 17]], [[2012]]న ముంబాయిలోని తన నివాసం మాతోశ్రీలో మరణించాడు.
<br>థాకరే స్థాపించిన ఆంగ్ల పత్రిక సామ్నా, హిందీ పత్రిక దోపహార్ సామ్నాలు సంతాపం ప్రకటించాయి. జాకెట్ పేజీలు, కవర్ పేజీలు కూడా పూర్తి నలుపులో ప్రచురించి ఆ పత్రికలు తమ విచారాన్ని వ్యక్తం చేశాయి. రెండు కవర్ పేజీలు పూర్తి నలుపు రంగులో ప్రచురించడం పత్రిక చరిత్రలో ఇదే తొలిసారి.
శివసేన అధినేత బాల్ థాకరే మృతదేహానికి సాయంత్రం ఆరు గంటలకు (నవంబరు 17) దహన సంస్కారాలు చేస్తారు. సందర్శన కోసం శివాజీ పార్కులో థాకరే మృతదేహాన్ని ఉంచారు. అభిమానుల తాకిడితో శివాజీ పార్కు కిక్కిరిసి పోయింది. ముంబయి రోడ్లు కూడా జనసంద్రమయ్యాయి. శివాజీ పార్కుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ తదితరులు చేరుకున్నారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బాల్_ఠాక్రే" నుండి వెలికితీశారు