లూయీ బ్రెయిలీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
అంధులకు చదువు చెప్పాలంటే వారికి పుస్తకాలు కావాలి. కంటతో వారు చూడ లేరు. స్మర్శ తప్ప మరో మార్గంలో వారు స్వయంగా చదువకోలేరు. అందుచేత మామూలు ప్రింటింగు పద్ధతినికాక, ఎత్తుగా ఉబ్బివుండే విధంగా అక్షరాలుఉన్న పుస్తకాలు కావాలి. స్పెయిన్‌ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్‌ 16వ శతాబ్దంలో చెక్కమీద ఎత్తుగా ఉబ్బివుండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొం దించాడు. విచిత్రమేమంటే గ్రుడ్డివాళ్ళకు చదువుకోవడానికి పుస్తకాలు ఎలా ప్రింటు చేయాలన్న విషయంలో ఎక్కువ కృషి సల్పింది అంధులే. రకరకాల ప్రయోగాలు చాలాకాలం జరిపారు. అయితే వారు చెక్క బోర్డు మీద పుస్తకాలు తయారు చేయాలని ప్రయత్నిం చారు. పారదస్‌ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతని మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం రూపొందిం చారు. . 1784లో ఇది కనుగొన్న ఘనత బ్రెయిలీకి దక్కింది. తరువాత ఎంతోమంది దీని గురించి పరిశోధన కొనసాగించారు. అయితే అవి గ్రుడ్డివారికి చదువు నేర్చు కొనడానికి అంత సులభంగా వుండేవికావు. ఆధునిక యుగంలో గ్రుడ్డివారి పుస్తకాలన్నీ బ్రెయిల్‌ పద్ధతిలో ఉంటున్నాయి. దీనిని కనుగొన్న వ్యక్తి లూయీ బ్రెయిలీ. తన పరిశోధన ద్వారా విప్లవాత్మకమైన మార్పు సాధించి నవయుగ వైతాళికుడయ్యాడు.
:20 సంవత్సరాల యువకుడైన బ్రెయిల్‌ తన నూతన పద్ధతి సిద్ధాంతీకరించాడు. మరి 5 సంవత్సరాల పరిశోధనలో బ్రెయిల్‌ తన పద్ధతిలో సంపూర్ణత సాధించాడు. ఆరు చుక్కలను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల బ్రెయిలీ మొత్తం అక్షరాలను రూపొందించాడు. ఇది విప్లవా త్మకమైన మార్పు, ఆరుపాయింట్లు వివిధ రకాలుగా వాడి మొత్తం ఇంగ్లీషు అక్షరాలన్నీ పలికేటట్లు చేశాడు. ఒక చుక్కనుండి ఆరు చుక్కలలోనే మొత్తం అక్షరాలన్నీ తయారు చేశాడు.
<gallery>
 
File:Braille alfabet.jpg|బ్రెయిలీ ఆంగ్ల అక్షరాల చార్టు.
File:Braille closeup.jpg|బ్రెయిలీ లిపి చదువు విధానము
</gallery>
 
:ఈ విధంగా మొత్తం భాషకు 250 గుర్తులు ఈ ఆరు చుక్కలలో బ్రెయిల్‌ రూపొందిం చాడు. ఈ రకంగా గ్రుడ్డివారు బ్రెయిలులో వ్రాయగలరు. చదవగలరు. వారికి ఇతరుల సహాయం అక్కరలేదు. ఇంగ్లీషు, తెలుగు, భాషలన్నీ ఎడంనుండి కుడికి వ్రాస్తాంకదా. బ్రెయిల్‌లో కుడినుండి ఎడమకు వ్రాయడం జరుగుతుంది. బ్రెయిలులో టైపురైటర్లు కూడా రూపొందించడం జరిగింది. అంధులకు అతను కనుగొన్న లిపికి గుర్తింపు అతని మరణానంతరమే వచ్చింది. సంగీతాన్ని కూడా తన లిపిలో వ్రాయడం అతని విశిష్టత. ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిలీ లిపికి గుర్తింపు వచ్చి అంగీకరించినా, అమెరికా 1916లోనే దానిని ఆమోదించింది.
 
==అస్తమయం==
బ్రెయిలీ 1852 జనవరి 6న 43 సంవత్స రాల పిన్న వయస్సులోనే మరణించాడు..బ్రెయిలీ మరణ శతాబ్ది సందర్భంగా 1952లోఅతని అస్తికలను పారిస్‌లో పాంథియన్‌లోకి మార్చి విశిష్ఠ వ్యక్తిగా అతనిని గౌరవించారు. బ్రెయిలీ 200 జన్మదినో త్సవం సందర్భంగా 2009లో ప్రపంచవ్యాప్తంగా అతనిని కీర్తించారు. బెల్జియం, ఇటలీ బ్రెయిలీ బొమ్మతో రెండు యూరోల నాణాన్ని విడుదల చేశాయి. మన భారతదేశం బ్రెయిలీ గౌరవార్థం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో విడుదల చేసింది. అదే విధంగా అమెరికా ఒక డాలరు నాణాన్ని విడుదలచేయడం అపూర్వం, అంధులకు విద్యాదానం చేసిన మహనీయుడు బ్రెయిలీ చిరస్మరణీయుడు.
"https://te.wikipedia.org/wiki/లూయీ_బ్రెయిలీ" నుండి వెలికితీశారు