రేడియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 143:
 
==సంఘం రేడియో==
దళిత మహిళలు ప్రారంబించినప్రారంభించిన '''సంఘం రేడియో''' ఆసియాలోనే తొలి మహిళా రేడియో, భారత్‌లోనే తొలి గ్రామీణ '''కమ్యూనిటీ రేడియో''' (Community Radio). [[జహీరాబాద్‌]]కు ఐదారు మైళ్ల దూరంలోని మాచునూరు గ్రామంలో ప్రాణం పోసుకుంది. ఇది జనం కోసం, జనమే నడిపే, జనం రేడియో.
 
ఈ 'రేడియో' కార్యక్రమాలు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా, గంటన్నర సేపు ప్రసారమవుతాయి. జహీరాబాద్ చుట్టుపక్కల పాతిక కిలోమీటర్ల పరిధిలోని నూట యాభై పల్లెల్లో వినొచ్చు. పస్తాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీ.డీ.ఎస్.) అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ల తరఫున ముందుండి పోరాడింది.
 
సంఘం మనుషులు ఏ చెట్టు కిందో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పెద్దల ముందు మైకుపెడతారు. వాళ్ల అనుభవ సారమంతా టేపుల్లో నిక్షిప్తం అవుతుంది. వారి జీవితానుభవాలను పిల్లలు తెలుసుకొవడానితెలుసుకొనడానికి ఇదొక మంచి అవకాశం. కొంత మంది కథలు చెప్పవచ్చును, సంగీత కచేరీ కూడా చేయవచ్చును.
 
కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ కమ్యూనిటీ రేడియోలకు తలుపులు తెరిచింది. బోణీ 'సంఘం రేడియో' వారిదే. బుందేల్‌ఖండ్‌లో కూడా ఈమధ్యే కార్యక్రమాలు మొదలయ్యాయి. కచ్ మహిళా వికాస్ సంఘటన్ (గుజరాత్), ఆల్టర్నేటివ్ ఫర్ ఇండియా డెవలప్‌మెంట్ (జార్ఖండ్), వాయిస్ ప్రాజెక్ట్ (కర్ణాటక)... ఇప్పటికే కమ్యూనిటీ రేడియోల్ని జనానికి పరిచయం చేశాయి. ఇంకో ఏడాదిలో పాతిక దాకా కొత్త రేడియోలు రావచ్చని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ రేడియో ఫోరం అంచనా. కమ్యూనిటీ రేడియో లైసెన్సు కింద చాలా [[విశ్వవిద్యాలయాలు]] సొంత స్టేషన్లు పెట్టుకున్నాయి. ఒక యూనిట్ స్థాపనకు 'ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు