ఆర్య 2: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: శుద్ధి
→‎కథ: విస్తరణ
పంక్తి 28:
అజయ్ తన స్నేహితుడిని ఆసుపత్రి లో స్ట్రెచర్ పై తీసుకువెళ్ళే సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. ఫ్ల్యాష్బ్యాక్ లో ఒక అనాథాశ్రమంలో ఆర్య అనే అబ్బాయి చేరతాడు. పరిగెడుతూ అనాథలందరూ దిగే మెట్లలో తను నమిలే బబుల్ గం ని ఒక మెట్టు పై అతికించి ఇది ఎవరు తొక్కితే వాడే తన బెస్ట్ ఫ్రెండ్ అని ఆర్య మనసులో అనుకొంటాడు. అజయ్ దానిని తొక్కుతాడు. అప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ పేరుతో అజయ్ ని ఆర్య వేధిస్తుంటాడు. ఆర్యకి ఈత వచ్చు కాబట్టి అజయ్ కి కూడా రావాలని నీటిలో తోసివేస్తాడు. తన చేయి తెగింది కాబట్టి అజయ్ చేయిని కోస్తాడు. స్నేహితుడిని ఎంచుకొనే విధానం, స్నేహం చేసిన తర్వాత స్నేహితునితో వ్యవహరించే తీరు లోనే ఆర్య తన లోని శాడిస్ట్ స్వభావాన్ని బయటపెడుతూ ఉంటాడు. ఒక సంపన్న కుటుంబం ఒక బాలుణ్ణి దత్తత తీసుకోవటానికి అనాథ శరణాలయం వస్తుంది. అజయ్ ఆర్య లలో ఎవరిని దత్తత తీసుకోవాలో సతమతమయిన వారి కోసం అజయ్ ఆర్య లు బొమ్మా బొరుసూ వేసుకొంటారు. ఆర్య గెలిచినా తన గెలుపూ అజయ్ గెలుపూ ఒకటే అని ఆర్య అజయ్ నే దత్తునిగా వెళ్ళ మంటాడు. పైకి బాధ నటించినా ఆర్య వేధింపు ల నుండి విముక్తి దొరికినందుకు లోలోపల సంతోషిస్తాడు అజయ్.
 
పెరిగి పెద్దయిన తర్వాత అజయ్ తన పేరిట ఒక సాఫ్ట్ వేర్ సంస్థ నడుపుతూ ఉంటాడు. అజయ్ ని ఒక గలాటాలో గాయపరచటంతో ఆర్య వారికి దేహశుద్ధి చేస్తాడు. కృతజ్నతగా తన సంస్థలో ఉద్యోగం ఇమ్మని బలవంతపెడుతున్న ఆర్యని తన స్నేహితుడిగా ఎక్కడా చెప్పుకోకూడదు అన్న షరతుపై అజయ్ ఆర్యకి ఉద్యోగమిస్తాడు. సిగరెట్టుకి సగంలో గీత గీసి అక్కడి వరకు ఒకరు తర్వాత ఇంకొకరు కాల్చాలని వింత నియమాలని పెడుతుంటాడు ఆర్య. పైకి మాత్రం మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకొంటుంటాడు.
పెరిగి పెద్దయిన తర్వాత అజయ్ తన పేరిట ఒక సాఫ్ట్ వేర్ సంస్థ నడుపుతూ ఉంటాడు.
"https://te.wikipedia.org/wiki/ఆర్య_2" నుండి వెలికితీశారు