టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
లోహపు తీగ చుట్టబడిన ఒక శాశ్వత అయస్కాంతం దగ్గర పల్చని ఇనుప రేకును కంపింపజేస్తే, కంపనాల తీవ్రత కు అనుగుణంగా తీగలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతున్నట్లు బెల్ కనుగొన్నాడు. శబ్దాన్ని ప్రసారం చేయటానికి ఈ సిద్ధంతం బాగా ఉపకరిస్తుందని అతడు గ్రహించాడు. ధామస్ వాట్సన్ అనే మెకానిక్ తో బాటు దీనికి సంబంధించిన ప్రయోగాలు చేసుకుంటూ అతడు పచ్చిక బయళ్ళలో, మైదానాల్లో, బీడు భూముల్లో తిరుగుతుండేవాడు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అపజయం అడుగడుగునా వెక్కిరించసాగింది. వెన్ను తట్టి ప్రోత్సహించేవారు కరువయ్యారు. ఎటు చూసినా నిరాశా నిస్పృహలే తారసిల్లాయి. టెలిఫోన్ ద్వారా నోటిమాటల్ని దూర ప్రదేశాలకు అందించే కృషి చేస్తున్నానని చెబితే నలుగురు నవ్విపోతారేమో అని భయపడుతూ అజ్ఞాతంగా కాలం గడిపేవాడు. కాబోయే మామ కూడా ఇది అంతా ఒక పగటి కల అని కొట్టి పారేశాడు.
 
1875 జూన్ లో ఒకరోజు వర్క్ షాప్ కి ఇటూ, అటూ ఉన్న రెండు గదుల్లో ప్రసారిణి, రిసీవర్ లను వుంచి వెల్, వాట్సన్ ప్రయోగాలు చేస్తుండగా ఒకదాని ఇనుపరేకు అయస్కాంతానికి అతుక్కుపోయింది. దాన్ని లాగాలని వాట్సన్ ప్రయత్నించినపుడు బెల్ వద్ద వున్న ఇనుపరేకు కూడా కంపించసాగింది. ఇనుపరేకు దగ్గర చెవి ఉంచగా శబ్దం కూడా వినబడింది. ఇక ఆ రొజల్ల ఒక పక్క ఇనుపరేకును అయస్కాంతానికి చాలా దగ్గరగా ఉంటే ప్రయోగ ఫలితాలు సంతృప్తి కరంగా ఉంటాయని వాళ్ళూ గ్రహించారు. ఇలా కొన్ని నెలలు కృషి చేశాక మొదటి పటిష్టమైన టెలిఫోన్ నిర్మించారు. బాటరీ అవసరంలేకుండా ప్రసారిణిలో ఉత్పత్తి అయ్యే అల్ప విద్యుత్ వల్లనే ఇది పనిచేయసాగింది. ఈ టెలిఫోన్ ప్రసారిణి బెల్ ఇంటి రెండో అంతస్తులోనూ, రిసీవర్ ని మొదటి అంతస్తులోనూ, అమర్చి బెల్ ఫోన్ లో ఇలా మాట్లాడాడు.---"'''మిస్టర్ వాట్సన్, మీతో పనుంది, పైకి రండి'''" ---. ఫోన్ లో మాట్లాదిన తొలిపలుకులుగా ఈ పదాలు ప్రసిద్ధి కెక్కాయి. ఒకటి రెండు నిముషాల్లో మెట్లెక్కి రొప్పుతూ, రోజుతూ వాట్సన్ బెల్ వద్దకు పరుగెత్తి వచ్చి "ఫోన్ పనిచేస్తుంది. మీ మాటలు నాకు వినబడ్డాయి." -- అని అరిచాడు.
===పేటెంట్ హక్కులు===
కొన్ని వారాలలోనే అతని 29 వ జన్మదినం సందర్భంగా టెలిఫోన్ తయారీకై అనుమతి పొందాడు. అదే సంవత్సరం వేసవిలో ఫిలడెల్ఫియా ఎగ్జిమిషన్ లో టెలిఫోన్ ని ప్రదర్శించాడు. మొదట దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. అదృష్టం మరోసారి బెల్ ని వరించింది. బ్రెజిల్ చక్రవర్తి రెండో ఫెడ్రో చూడగానే బెల్ ని గుర్తించాడు. బోస్టన్ విశ్వవిద్యాలయంలో మూగ వాళ్ళకు మాట్లాడడంలో తర్ఫీదు ఇస్తున్నప్పుడు చక్రవర్తి ఒకసారి తరగతిలో కూర్చున్నాడు. ఆ పరిచయంతో బెల్ తన పరికరాన్ని గురించి చక్రవర్తికి వివరించాడు. రిసీవర్ లో బెల్ ధ్వని వినపడగానె చక్రవర్తి ఎగిరి గంతేశాడు.
 
===కెల్విన్ సందేశం===
అప్పటి నుండి టెలిఫోన్ అందరినీ ఆకర్షించింది. ప్రఖ్యాత ఇంగ్లండ్ భౌతిక శాస్త్రజ్ఞుడు [[లార్డ్ కెల్విన్]] దీన్ని చూశాక ఇలా రాశాడు. -- "కొత్త పరికరాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. అతి మామూలు సామాన్లతో ఈ పరికరం నిర్మించబడింది. దీన్ని సాంకేతికంగా మెరుగు పరచి వందల మైళ్ళ దాకా మన మాటలు వినబడేలా బెల్ కృషి చేస్తాడని మనం ఆశించవచ్చు."
 
== అన్ని సెల్‌ఫోన్లకు ఒకే [[ఛార్జర్]] ==
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు