రహదారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
రోడ్ల నిర్మాణంలో ఈ దేశాలన్నీ సమర్థ వంతంగా పాల్గొన్నప్పటికీ రోమన్ లదే అందె వేసిన చేయి. వాళ్ళ దేశం లోనే కాకుండా, స్కాట్లండ్ సరిహద్దుల నుండి పర్షియన్ సింధుశాఖ వరకు, కాకసన్ నుంచి అట్లాస్ పర్వతాల వరకు తొలిసారిగా రోడ్లు నిర్మించింది వారే. అయితే ఈ రోడ్లు వేయటం ఆయా ప్రాంతాల ప్రజల మీద అభిమానం పుట్టుకొచ్చి మాత్రం కాదు. వాళ్ళ సైన్యాన్ని తరలించటానికి , వాళ్ళ వర్తకులు, అధికారులు సుఖంగా ప్రయాణం చేయటానికీ ఈ రోడ్లు ఉపయోగ పడతాయన్న స్వార్థం తోనే!
 
==రోమనుల రోడ్లు==
సాంకేతిక పరంగానూ, సంస్థా పరంగానూ, పరిపాలనా నిర్వహణ దృష్ట్యానూ పరిశీలిస్తే రోమన్ రహదార్ల వ్యవస్థ ప్రశంసనీయమైంది. చక్రవర్తులు పరిపాలించే కాలంలో మొత్తం రోడ్ల పొడవు సుమారు 50,000 మైళ్ళ దాకా ఉండేది. పర్వతాలూ, నదులూ, పచ్చిక బయళ్ళూ, చిత్తడి నేలలూ రోమన్ ఇంజనీర్ల ఉత్సాహం ముందు తలలు వంచి చదునైపోయాయి. సంవత్సరం పొడవునా అన్ని రకాల వాహనాల సురక్షిత ప్రయాణానికి అనుకూలంగా ఉండి, పది కాలాల ల్పాటు మనగలిగేలా రోడ్లను వాళ్ళూ నిర్మించారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల్లో దొరికే నిర్మాణ సామాగ్రిని బట్తి వివిధ రకాల నిర్మాణ పద్ధతులను వాడారు. కానీ ప్రతిచోటా మొదట పెద్ద పెద్ద రాతి బడల్ని అమర్చటం, దానిపైన చిన్న రాళ్ళను పరచటం, దానిపై ఒక వరుస ఇసుకను వేయటం తప్పని సరిగా చేసే వారు. గులక రాళ్ళను సున్నపు రాతితో కలిపి దీనిపై మరో వరుస పరిచేవారు. స్థానికంగా రాళ్ళు దొరకని నేలల్లో కొయ్యతో చేసిన వంతెనలు నిర్మించే వారు. వాటి పొడవు 12 నుంది 20 అడుగుల దాకా ఉండేవి. వర్షపాతం మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్లు వాలుగా ఉండేలా నిర్మించి వర్షం నీళ్ళు త్వరగా ప్రవహించేటట్లు చేశారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రహదారి" నుండి వెలికితీశారు