చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 58 interwiki links, now provided by Wikidata on d:q76768 (translate me)
పంక్తి 11:
;పెల్టియర్‌ కోటు
నిప్పులు చెరిగే ఎండైనా.. ఎముకలు కొరికే చలైనా ఆ కోటు ముందు బలాదూర్‌.ఇది మైనస్‌ 30 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ వరకూ తట్టుకుంటుంది. శరీర ఉష్ణోగ్రతను 18 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంచుతుంది. క్రాంతికిరణ్‌ ఈ జాకెట్‌ను తయారుచేశారు. రెండు వేర్వేరు లోహాలను స్వల్ప విద్యుత్‌ప్రవాహంతో కలిపి ఉష్ణోగ్రతల్లో తేడాలను సాధించవచ్చని 1834లో పెల్టియర్‌ గుర్తించారు. జాకెట్‌ బరువు 650 గ్రాములు.(ఈనాడు 11.3.2010)
[[File:Overall Shirt Details wiki.svg|right|thumb|300px|ఫుల్ స్లీవ్స్ కలిగిన ఒక సాధారణ (అమెరికన్) షర్ట్ ముందు మరియు వెనుక భాగాలు]]
* '''ఇంగ్లీష్ షర్ట్''': ఇవి మొదటి తరం షర్టులు. ఇవి ఇప్పుడు వేసుకొనే మామూలు షర్టు వలెనే కానీ బొత్తాలు మాత్రం టి-షర్టు లకు ఉన్నట్టు ఛాతీ వరకు మాత్రం ఉండేవి. వీటి ధారణ కూడా టి-షర్ట్ ధారణ వలెనే ఉండేది. వెనుక ప్లీటులు వీపు మధ్య భాగం వద్ద దగ్గరగా కాకుండా బాగా ఎడంగా ఉండేవి. ధరించే సమయంలో ఇస్త్రీ నలిగే అవకాశం ఎక్కువగా ఉండటం, ధరించే విధానం కష్టతరంగా ఉండటం వంటి వాటి వలన తర్వాతి కాలంలో అమెరికన్ షర్ట్ లు జనాదరణ పొందాయి. ప్రస్తుతం ఇంగ్లండు వారు కూడా అమెరికన్ షర్ట్ల పైనే మొగ్గు చూపటం విశేషం.
* '''అమెరికన్ షర్ట్''': కాలరు వద్ద నుండి క్రింద వరకు బొత్తాలు కలది. ఇంగ్లీష్ షర్ట్ తో పోలిస్తే వీటి వినియోగం, ధారణ, ఇస్త్రీ సులభం. అమెరికన్ షర్ట్ వచ్చిన తర్వాత షర్టులలో (కాలరులలో తప్పితే) పెద్ద తేడాలు కనబడలేదు. బిగుతు షర్ట్ లకి చిన్న కాలర్లు, బెల్ బాటం ప్యాంట్ల కాలంలో చాలా పెద్ద (భుజాల వరకు వచ్చే పాయింటెడ్, రౌండెడ్) కాలర్లు, ప్యారలెల్ ప్యాంట్ల సమయంలో బటన్ డౌన్ కాలర్ల వంటి స్వల్ప మార్పులు మాత్రం కనబడ్డాయి.
* '''బుష్ షర్ట్'''
* '''మనీలా షర్ట్'''ఆ
====షర్టు కఫ్ లు====
కఫ్ అనగా ఫుల్ (స్లీవ్స్) షర్టుకు ముంజేతి వద్ద ఉన్న భాగము. షర్టులకి ఇది రెండు రకాలు
* సింగిల్ కఫ్: బొత్తా ఉపయోగించేది. ఎక్కువగా వాడబడేది
* డబుల్ కఫ్: కఫ్ లింకు ఉపయోగించేది. ఒకప్పుడు వాడేవారు. కానీ ప్రస్తుతము దీని వాడకము తగ్గినది. డబుల్ కఫ్ ల ని వెనక్కి మడచి [[కఫ్ లింకులు]] పెట్టవలెను.
 
====కాలరు====
గొంతు వద్ద షర్టుకు ఉన్న భాగము. దీనికి సందర్భానుసారము [[నెక్ టై]] కానీ [[బౌ టై]] కానీ కట్టుకొంటారు. అసాంప్రదాయికంగానూ వినియోగించవచ్చిననూ, కాలరు హుందాతనానికి చిహ్నం. కొన్ని సంస్థలలో కాలరు లేని షర్టులు నిషిద్ధం.
కాలర్లలోని రకాలు
* షేక్స్పియరియన్
* కట్ అవే
* మ్యాండరిన్
* పాయింటెడ్
* రౌండ్
* వింగ్
 
====ల్యాపెల్====
కోటు కు వలె షర్టుకి చిన్న ల్యాపెల్ ఉండవచ్చును. ఇది అసాంప్రదాయికం. టై, బౌ కట్టలేరు. టి-షర్టుల వినియోగం పెరిగినందువలన, ప్రస్తుత కాలంలో షర్టులకి ల్యాపెల్ వినియోగం తగ్గినది.
 
== చొక్కాలు-రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు