ప్యాంటు: కూర్పుల మధ్య తేడాలు

→‎ట్రౌజరు భాగాలు: ఇతర ప్యాంటుల భాగాలు
→‎ప్యాంటులలో రకాలు: సంవత్సరాలు చేర్చాను
పంక్తి 6:
 
[[File:Trouser-parts.svg|right|thumb|200px|మొదటి తరం ప్యాంటు, వివిధ భాగాలు]]
* '''<big>మొదటి తరం</big>''': '''ప్లీటెడ్ ట్రౌజర్సు''' భారతదేశంలో ధరింపబడిన మొదటి తరం ప్యాంట్లు. మోకాలి గుండా నిలువుగా రెండు కాళ్ళకి క్రీజ్ (మడత)లు ఉండేవి. వీటికి నడుముకి ఇరువైపులా రెండు ప్లీట్లు ఉండేవి. ఇవి నడుము కంటే పైకి ధరించబడేవి. పాదం వద్ద బయటికి కనిపించేలా మడత వేసి కుట్టేవారు. వీటిని కఫ్స్ అంటారు. ఇదే కాలంలో ప్లీటెడ్ ట్రౌజర్స్ కి అసాంప్రదాయిక ప్రత్యాన్మాయంగా లో-వెయిస్టెడ్ ప్యాంట్సు వేసేవారు. వీటిని నడుము క్రిందకు కట్టేవారు. 60వ దశకం ద్వితీయార్థం వరకు ప్లీటెడ్ ట్రౌజర్లు కొనసాగాయి.
* '''<big>రెండవ తరం</big>''': కొంత కాలము తర్వాత '''న్యారో''' అని పిలువబడే బిగుతు ప్యాంట్లు వచ్చినవి. 60వ దశకానికి [[హాలీవుడ్]] లో [[సీన్ కానరీ]] మొదలు పెట్టిన [[జేంస్జేమ్స్ బాండ్]] చిత్రాలు, 1961 లో హిందీ చిత్రం [[జంగ్లీ]] లో [[షమ్మీ కపూర్]] హద్దులు లేని అల్లరి, 1967 లో తెలుగునాట విడుదలైన [[గూఢచారి 116]] లో [[ఘట్టమనేని కృష్ణ]] కట్టిన గూఢచారి చిత్రాలువేషం వీటిని ప్రజలకి దగ్గర చేశాయి. ఈ తరం నుండి కఫ్ వాడకం కనుమరుగైనది. అప్పటి యువత ప్లీటెడ్ ట్రౌజర్లని డబ్బా ప్యాంట్లు అని సరదాగా వ్యవహరించేవారు. పాత ఫ్యాషన్ యే ఇష్టపడే వయసైన వారు టైట్ ప్యాంట్లని గొట్టం ప్యాంట్లు గా అవహేళన చేసేవారు.
* '''<big>మూడవ తరం</big>''': తర్వాత '''బెల్ బాటం''' లు వచ్చాయి. మోకాలి వరకు బిగుతుగా ఉండి, మోకాలి వద్ద నుండి పాదం వరకు గంట ఆకారంలో వదులుగా ఉండటంతో వీటికి ఆ పేరు వచ్చినది. కథానాయకుడు సహృదయుడు గా ఉండే [[రాజేష్ ఖన్నా]] కాలం ముగిసి, నిరుద్యోగం, స్మగ్లింగ్, అన్యాయ వ్యవస్థ పై యువత అసంతృప్తిలో పెరిగిన అసంతృప్తి, ప్రభుత్వాలని ప్రశ్నించే తిరుగుబాటు ధోరణి గల [[అమితాబ్ బచ్చన్]] కాలంశకం ఆరంభమైనది. పొడుగ్గా ఉన్నఆజానుబాహుడైన అమితాబ్ కి బెల్ బాటం శైలి బాగా నప్పటంతో యువత ఈ శైలిని అనుకరించటం మొదలుపెట్టారు. 1972 లో విడుదలైన [[మేరే జీవన్ సాథీ]] లో ఖన్నా మొట్టమొదట బెల్-బాటం ఫ్యాషన్ లో కనబడగా, అదే సంవత్సరం సోలో హీరోగా [[జంజీర్]] తో భారీ విజయాన్నందుకున్న అమితాభ్ అందులో పెద్దగా విజయవంతం కాని [[అభిమాన్]] లలో ఇంకా న్యారో ప్యాంట్ లనే ధరించాడు. వెంటనే 1973 లో ఇద్దరూ కలసి నటించిన [[నమక్ హరామ్]] లో ఇరువురూ బెల్ బాటం లలోనే కనబడ్డారు. 1975 నాటికి [[యమగోల]] చిత్రంలో [[నందమూరి తారకరామారావు]] బెల్-బాటం లో కనబడ్డాడు.
* '''<big>నాల్గవ తరం</big>''': కొద్ది రోజులు ఏ ఫ్యాషన్ లేకుండా '''స్ట్రెయిట్ లెగ్''' ధరించారు. దీనిని ఫ్యాషన్ కి శూన్యావస్థ కాలంగా అభివర్ణించవచ్చును.
* '''<big>ఐదవ తరం</big>''': తర్వాత '''బ్యాగీ''' ప్యాంట్లు వచ్చినవి. అరబ్బుల పైజామాలు పోలి ఉండే ఈ ప్యాంట్లు నడుము నుండి మోకాలు వరకు వదులు పెరుగుతూ, అక్కడ అత్యధిక వదులు ఉండి, మరల మోకాలి నుండి పాదం వరకు వదులు తగ్గుతూ, అక్కడ అత్యల్ప వదులు ఉండేవి.
"https://te.wikipedia.org/wiki/ప్యాంటు" నుండి వెలికితీశారు