ఆర్య 2: కూర్పుల మధ్య తేడాలు

→‎విశేషాలు: సంభాషణలు/పాటలు
→‎కథ: విస్తరణ
పంక్తి 31:
 
సంపన్న కుటుంబంలో పెరిగి పెద్దయిన తర్వాత అజయ్ తన పేరిట ఒక సాఫ్ట్ వేర్ సంస్థ నడుపుతూ ఉంటాడు. అజయ్ ని ఒక రౌడీమూక గాయపరచటంతో ఆర్య వారికి దేహశుద్ధి చేస్తాడు. కృతజ్ఞతగా తన సంస్థలో ఉద్యోగం ఇమ్మని బలవంతపెడుతున్న ఆర్యని తన స్నేహితుడిగా ఎక్కడా చెప్పుకోకూడదు, మంచి వాడిగా పేరు తెచ్చుకోవాలి అన్న అజయ్ షరతులకు ఒప్పుకోవటంతో ఆర్యకి ఉద్యోగమిస్తాడు. ఒక వైపు సిగరెట్టుకి సగంలో గీత గీసి అక్కడి వరకు ఒకరు తర్వాత ఇంకొకరు కాల్చాలని వింత నియమాలని పెడుతూనే మరొక వైపు సంస్థలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకొంటుంటాడు ఆర్య. ఏ '''డిఫెక్టూ''' లేని '''మిస్టర్ పర్ఫెక్ట్''' గా వ్యవహరిస్తున్న ఆర్య ఆ సంస్థ మానవ వనరుల నిర్వాహకుడు దశావతారం ([[బ్రహ్మానందం]]) అభిమానాన్ని చూరగొనటమే కాక సహోద్యోగిని శాంతి ([[శ్రద్ధా దాస్]]) ని కూడా ఆకర్షిస్తాడు. గీత ([[కాజల్ అగర్వాల్]]) కొత్తగా ఆ సంస్థలో చేరగానే ఆర్య, అజయ్ లిద్దరూ గీతని ప్రేమించటం మొదలుపెట్టటంతో కథ ముదిరి పాకాన పడుతుంది.
 
గీత టీం కి లీడ్ ఆర్య నే. ఒకరోజు కేవలం ఆర్య ఉన్న లిఫ్టులో గీత ఎక్కుతుంది. మిస్టర్ పర్ఫెక్ట్ తో గుక్క తిప్పుకోకుండా మాటాడుతున్న గీతని ఆర్య్ చుంబిస్తాడు. ఎవరికీ తెలియకుండా గీతకి తన ప్రేమని వ్యక్తపరుస్తుంటాడు. అప్పటికే ఉత్తమ ఉద్యోగి పతకాన్నందుకున్న ఆర్య పై ఇవన్నీ భ్రమలని దశావతారం తోసిపుచ్చుతాడు. ఆర్యని సంస్థ నుండి పంపేయాలని ఎత్తు వేసిన అజయ్ తన కారుని ఆర్య కావాలనే ఢీ కొట్టినట్లు అందరినీ నమ్మిస్తాడు. అయితే ఇది తెలుసుకొన్న గీత అజయ్ తన ప్రేమ పొందటానికే అలా చేశాడని భావించి తను కూడా అజయ్ ని ప్రేమించటం మొదలు పెడుతుంది.
 
స్నేహితుడి కోసం ఎంతటి త్యాగానికైనా ఒడిగట్టగలిగిన ఆర్య అజయ్-గీతల పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు. కానీ అదేరోజు గీతని పెద్ద ఫ్యాక్షనిస్టు అయిన తన తండ్రి పెద్ది రెడ్డి ([[ముఖేష్ ఋషి]]) పంపిన మనుషులు వారి సొంతూరైన [[కర్నూలు]]కి తీసుకెళ్ళిపోతారు.
 
==సంభాషణలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్య_2" నుండి వెలికితీశారు