రైలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
 
అవిరి రైళ్ళ కంటే ఎలక్ట్రిక్ రైళ్ళ విషయంలో అనేక సౌలభ్యాలున్నాయి. ఆవిరిని ఇంజన్ బాయిలర్లలో ఎక్కడికక్కడే తయారుచేసుకోవాలి. కానీ ఎలక్ట్రిక్ రైళ్ళకు కావలసిన విద్యుచ్చక్తిని కొన్ని పెద్ద పవర్ స్టేషన్లలో ఉత్ప్త్తి చేసి నిర్వహణ ఖర్చులను తగ్గించవచ్చు ఆవిరి రైళ్ళలో ఉపయోగించటానికి వీలులేని నాసిరకం బొగ్గు, జలశక్తి,సహజ వాయువు, పరమాణు శక్తి లాంటి ఇంధనాలనూ, శక్తి జనకాలనూ విధ్య్చ్చక్తి ఉత్పాదనలో వాడుకోవచ్చు. ఎలక్ట్రిక్ రైళ్ళు తమ ఇంధనాన్ని గానీ, నీటిని గానీ ఆవిరి రైలు లాగా మోసుకొని పోవలసిన పనిలేదు.పని చేసేటప్పుడు మాత్రమే ఇవి శక్తిని ఉపయోగించుకుంటాయి. కానీ ఆవిరి రైలు బయలు దేరటానికి చాలా ముందుగానే ఆవిరిని సిద్ధం చేసి ఉండాలి. రైలు ;స్టేషన్ల వద్ద ఆగిఅప్పుడూ, ప్రయాణం ముగించిన కాసేపటికి వరకూ కూడా ఇంధనం సష్టమవుతుంది. ఎలక్ట్రిక్ రైలులో నియంత్రణ సాధనాలను, రక్షణ సదుపాయాలను వీటిలో జోడించటానికి వీలుంది. ఇంధనాన్ని పలుమార్లు ఇంజన్ లోకి జొప్పించే అవసరం లేకపోవటంతో గమ్య స్థానాన్ని వేగిరంగ చేరుకోవచ్చు.
 
ఎలక్ట్రిక్ రైళ్ళలో పొగ, మసి లెకపోవటం ప్రయాణీకులకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇంజన్ పొగ లోని ఆమ్ల సంబంధమైన అంశాల వల్ల ఇళ్ళు, కట్టడాలు దెబ్బతినే ప్రశక్తి లేదు. పొగగొట్టం నుంచి వచ్చే మిణుగులుల వల్ల అపాయం లేదు. పొరంగాల్లో వెళ్ళేటప్పుడు వాతావరణం కలుషితం కాదు. మట్ట ప్రాంతాల్లో ప్రయాణం ఆవిరి రైలు కంటే వేగంగా ఉంటుంది. ఈ అన్ని కారణాల మూలంగానే రైలు మార్గాల విద్యుదీకరణ అన్ని దేశాల్లోనూ విస్తృతంగా జరుగుతోంది.
==విద్యుదీకరణ - రకాలు==
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు