రైలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 124:
 
==హూపర్ రైలు==
బహుశా అచిరకాలంలోనే ఆల్‌వెగ్ రైలు కూడా కాలగర్భం లో కలిసిపోయేలా కనిపిస్తుంది. చక్రాలే లేకుండా కుషన్ లాంటి గాలిపొర మీద ప్రయాణంచేసే హూవర్ రైలు అనే కొత్త పద్ధతి వెలుగులోకొచ్చింది. ఇందులో తలకిందులుగా ఉండే T అక్షరం ఆకారంలో ఒకే పట్టా ఉంటుంది. దీన్ని తాకకుండ సంపీడిత గాలి కుషన్ పై రైలు పెట్టెలు పరుగెడతాయి. ఘర్షణ ఉందదు కాబట్టి గంటకు 300 మైళ్ల దాకా వేగాన్ని ఇది పుంజుకోగలదు. బ్రిటన్, ఫ్రాన్స్,అమెరికా దేశాల్లో ఈ హూవర్ రైలు వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ లండన్ ఇంపీరియల్ కళాశాలకు చెందిన ఇ.ఆర్.లేత్వెయిట్ నిర్మించిన లీలియర్ ఇండక్షన్ మోటార్ అనే సాధనంపై ఆధారపడినవే. ఈ సాధనంతో ఒక తీగ చుట్ట ఉంటుంది. దీనిలో 40 అంగుళాల పొడవు గల దండాయస్కాంతం ఉంటుంది. తీగచుట్టకూ, విద్యుత్ వాహక పట్టాకు మధ్య ఏర్పడే బలాల మూలంగా రైలు ముందు దిశలో లాగబడుతుంది. ఇలాంటి పట్టాను నగరాన్నీ, విమానాశ్రయాన్నీ కలిపే రహదారి మధ్య భాగంలో నిర్మించవచ్చు.
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు