రైలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
 
==మాంచెస్టర్-లివర్‌పూల్ మార్గం==
[[File:Planet_replica.jpg|200ox200px|right|thumb|మాంచెస్టర్-లివర్‌పూల్ మధ్య తిరిగే రైలు]]
[[File:InterCity2 - passenger car interior.jpg|200px|right|thumb|ప్రయాణీకుల రైలు]]
1930 సెప్టెంబర్ 15 వ తేదీన మాంచెస్టర్ లివర్‌పూల్ మార్గం ప్రారంభించబడినది. దురదృష్టవశాత్తు మొదటి రైలు ప్రమాదం కూడా ఆనాడే జరిగింది. రైలు మార్గం బిల్లుకు మద్దతు ప్రకటించిన లివర్ పూల్ పార్లమెంట్ సభ్యుడు విలియం హస్కీనన్ రాకెట్ చేత పక్కకు తోయబడి నప్పుడు గాయాలు తగిలాయి. స్టీఫెన్‌సన్ నిర్మించిన మరో ఇంజన్ లో అతణ్ణి తక్షణం లివర్‌పూల్ ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటలలో అతడు కన్ను మూసాడు. కానీ ఈ దుర్ఘటన కొత్త రవాణా సాధనం అభివృద్ధిని ఆపలేకపోయింది. ఇంగ్లండ్ లో ఎక్కడ చూసినా స్టీఫెన్‌సన్ పేరు మారుమోగిపోయింది. రైలు మార్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వ పరమైన సంస్థను యేర్పాటు చేయాలని కొందరు సూచించినప్పటికీ, చిన్న చిన్న ప్రయివేట్ కంపెనీలే దీన్ని నిర్వహించాలని పార్లమెంట్ తీర్మానించింది. కేంద్రీకృత వ్యవస్థ అవసరాన్ని గుర్తించటానికి ఒక శతాబ్దం కంటే ఎక్కువ పట్టింది.
 
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు