వంతెన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
వేలాడే వంతెనలపై పనిచేసే బలాలను లెక్కించటం, నిర్మాణ పదార్థాలు దృఢత్వాన్ని పరీక్షించటం ఇతర నమూనాల కంటే ఖచ్చితంగా చేయవచ్చు. కాబట్టి 19,20 శతాబ్దాల్లో ఈ రకం వంఎనలు విస్తృతంగా నిర్మించబడ్డాయి. ఉదాహరణకు, ఏదైనా వేదికను వేలాడదీయటానికి సాగదీసిన తీగలు సమర్థవంతంగా పనిచేస్తాయని ప్రయోగాల్లో తెలిసింది. ఈ కారణంగానే అనేక వేల పోగులు(Strands) గల ఉక్కు మోకులను వేలాడే వంతెనలు నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. ఫిలడెల్ఫియా-కాండెన్ రహదారిలో 1926 లో నిర్మించిన వంతెన 1750 అడుగుల పొడవుతో ఉంది. 18,666 తీగ పోగులను కలిగి 30 అంగుళాల వ్యాసం గల రెండు మోకులతో ఈ వంతెనను వ్రేలాడదీశారు. న్యూయార్క్ వద్ద ఈస్ట్ నదిపై ఇలాంటి వంతెనలు మరో మూడు ఉన్నాయి. వీటిలో శాన్‌ఫ్రాన్సిస్కో వద్ద నిర్మించిన వంతెన మూడు భాగాలుగా ఉంది. మధ్య భాగం పొడవు 4,200 అడుగులు, ఇరుపక్కలా ఒక్కొక్క భాగం 1,100 అడుగులు కలిగి ఉన్నాయి.
 
మూడు డచ్ ద్వీపాలను కలుపుతూ యూరప్ ఖండంలో నిర్మించబడిన వంతెన దాదాపు మూడు మైళ్ళ పొడవుతో ఉంది. అత్యంత మనోహరమైన ఈ వంతెన నిర్మాణం 1965 లో పూర్తి అయింది. స్కాట్లండ్ లో 500 అడుగుల ఎత్తు గల ఉక్కు స్తంభాలపై నిర్మించిన వంతెనను రెండు మోకులతో వేలాడదీశారు. ఒక్కొక్క మోకు రెండడుగుల మందాన్ని కలిగి 11,618 ఉక్కు పోగులతో చేయబడింది. ఈ వంతెన పొడవు సుమారు ఒకటిన్నర మైలు ఉంటుంది.
 
== వంతెనలలో రకాలు ==
"https://te.wikipedia.org/wiki/వంతెన" నుండి వెలికితీశారు