సతీసహగమనం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 33 interwiki links, now provided by Wikidata on d:q208088 (translate me)
పంక్తి 6:
సతీ అన్న పదము [[సతీదేవి]] నుండి వచ్చింది. శివ పురాణంలో సతీదేవి దక్షుని కూతురు. ఈమె మరో పేరు దాక్షాయని. దక్షుడు తన భర్త అయిన [[శివుడు|శివున్ని]] అవమానించడం భరించలేని దాక్షాయని స్వయంగా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విధముగా ఆత్మార్పణం గావించిన స్త్రీలును కూడా సతీ అంటారు. అలాగే పతివ్రతలను కూడా సతీ అని వ్యవహరిస్తారు.
 
'''[[సతీ సహగమనం]]''' పూర్వం భారత దేశంలో సతీ సహ గమనం అమలులో వుండేది. దేశవ్యాప్తంగా అగ్ర కులాలైన బ్రాహ్మణ , క్షత్రియ కులాల్లో సతీ సహగమనం ఉండేది. కళింగ విజయనగర సామ్రాజ్యంలో కూడ ఈ పద్దతి అమలులో వుండేది. ఆనాడు అనగా సుమారు 500 సంవత్సరాల క్రితం విజయనగరాన్ని సందర్సించిన ఒక ఫోర్చ గీసు యాత్రికుడు సతీ సహగమన వ్వవహారాన్ని స్వయంగా చూసి వ్రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఈ క్రింది విధంగా ఉంది.
 
'' ఈ రాజ్యంలోని ప్రజలందరు విగ్రహా రాధకులే. స్త్రీలు చనిపోయిన తమ భర్తతో బాటు చితిలో దూకి మరణించటం వీరి ఆచారం. దీన్ని వీరు గౌరవ ప్రదమైన చర్యగా భావిస్తారు. భర్త చనిపోయి నప్పుడు.... భార్య బందు వర్గంతో కలిసి రోదిస్తుంది. కాని ఆ రోధన ఒక పరిమితిని దాటితే ఆ స్త్రీ తన భర్తతో బాటు సహగమనానికి సిద్దంగా లేదని భావిస్తారు. ఆమె ఏడుపు మానగానె సహగమనానికి పురికొల్పుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారానికి, సాంప్రదాయానికి భంగం కలిగించ వద్దని భోదిస్తారు. ఆ తర్వాత ఆ మరణించిన వ్వక్తిని కర్రలతో చేసిన వేధిక పై పడుకో బెట్టి పూలతో అలంకరిస్తారు. అతని భార్యను ఒక చిన్న గుర్రంపై కూర్చో బెట్టి శవం వెంబడి పంపుతారు. అప్పుడామె తనకున్న ఆబరణాలనన్నీంటిని ధరించి వుంటుంది. అన్ని రకాల పూలను కూడ ధరించి వుంటుంది. చేతిలో అద్దం కూడ ధరించి వుంటుంది. శవం వెంబడి అనేక సంగీత వాయిద్యాలు, బాజా బజంత్రీలు రాగా వెనుక బందుజన సముదాయ నడుస్తుంతుంది. వీరందరు చాల సంతోషంగా వుంటారు. ఒక వ్వక్తి ఒక వాయ్యిద్యాన్ని వాయిస్తూ ఆస్త్రీ వైపు చూసి ఇలా పాట పాడుతాడు. 'నీవు నీ భర్తను చేరడానికి వెళుతున్నావు..... ' దానికి ఆ స్త్ర్హీ దానికి సమాదానంగా 'అవును నేను నా భర్త వద్దకు వెళుతున్నాను.... '' అని పాట ద్వారా తెలుపుతుంది.
"https://te.wikipedia.org/wiki/సతీసహగమనం" నుండి వెలికితీశారు