జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
ఈ వలస నుంచి చీలిక ఏర్పడింది. కారణం ఆరామ క్రమశిక్షణ మీద వచ్చిన వివాదం. వలసకు నాయకత్వం వహించిన భదర్బాహుడు, వర్థమానుడు నొక్కి చెప్పిన దిగంబరత్వాన్ని పాటించాలన్నాడు. అక్కడే నిలిచి పోయిన సన్యాసులు నాయకుడైన స్థూలభద్రుడు కాటకం, గందరగోళాల కారణంగా, శ్వెతాంబరాలను ధరించటానికి అనుమతించాడు. ఈ విధంగా దిగంబర, శ్వేతాంబర చీలిక అంతిమ రూపం దాల్చలేదు. సైద్ధాంతీకం గా రెండింటి మధ్య పెద్ద తేడాలు లేవు. తరువాత దిగంబర జైనులు బయటికి వచ్చేటప్పుడు బట్టలు వేసుకొనేవారు. కాని ఈ విభజన నేటికీ ఉంది.
===రెండు వర్గాల నడుమ తేడాలు===
# నిర్వాణం పొందటానికి నగ్నత్వం ముఖ్యమని దిగంబరులు, శ్వేతాంబరులు కాదని భావించారు.
# స్త్రీలకు విముక్తి లేదన్నారు దిగంబరులు. శ్వేతాంబరులలో 19 వ తీర్థంకరుడైన మల్లినాథులు స్త్రీలకు విముక్తి ఉందన్నారు.
# దిగంబరులు ఆగమ(మత) గ్రంథాల అధికారాన్ని కాదన్నారు. నాలుగు వేదాల లాగే వారికి వారి "చతుర్పూర్వలు"న్నాయి.
# దిగంబరులలో ఎక్కువ మంది. దేవాలయాలలో విగ్రహ పూజ చేస్తారు. శ్వేతాంబర జైనులు పవిత్ర నివసాలలో(స్థానకాలలో) వుండి జైన గ్రంధ బోధలను చెబుతారు. శ్వేతాంబరులలోనూ విగ్రహారాధకులు లేకపోలేదు.
# దిగంబరులు మహావీరుని, తీర్థంకరులను గుడులలో పూజిస్తారు. వీరికి అనెక సంఘాలున్నాయి. నంది సంఘం, సిన్ సంఘం, దేవ్ సంఘాలు.వీరు తరన్ స్వామి(1448-1515) విరచిత గ్రంథాలను చదువుతారు.శ్వేతాంబరులు స్థానకాలలో ఉంటూ కాలినడకన ఒకచోటు నుండి మరో చోటుకు వెళ్ళి బిక్ష గ్రహిస్తారు. సూర్యాస్తమయం ముందే భోజనం చేస్తారు.
 
==పండుగలు==
 
== ఆంధ్రప్రదేశ్ లో జైన మతం ==
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు