జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
సన్యాసి అయినవాడు అహింసను తప్పనిసరిగా పాటించాలి. శాకాహారాన్ని భుజించాలి. అహింసా విధానం ఎంతవరకు వెళ్ళిందంటే, భూమిలో ఉండే వానపాములు చనిపోతాయని, అసలు భూమినే దున్నవద్దన్నారు. ఆ కారణంగా జైనులు ఎక్కువ మంది నగరాలకు వలస పోయి, వ్యాపారాలలో స్థిరపడ్డారంటారు.
 
అన్ని వస్తువులకు - జీవులు గాని - అజీవులు గాని - వివిధ స్థాయిలలొస్థాయిలలో చైతన్యం ఉంది. వాటికి ప్రాణం ఉంది. గాయాలైతే అవి బాధ పడతాయి. అందువలన అహింసను అంత ప్రముఖంగా పరిగణించారు.
 
ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడన్నా, దానినతడు నిర్దేశిస్తాడన్నా మహావీరుడు అంగీకరించడు. అతడి ప్రకారం సృష్టి లేదు. సృష్టి కర్త లేడు. అసలు ఈ ప్రపంచాన్ని వివరించటానికి ఏ రకమైన సృష్టి కర్త అవసరం లేదు. అతడి ఉద్దేశ్యంలో దేవుడు అంటే అంతర్గత శక్తులు పూర్తిగా అభివ్యక్తమైన మానవుడు, పరిపూర్ణ మానవుడు.
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు