సంస్కృతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
====భారతీయ భాషలకు ప్రాణము====
 
ఆధునిక యుగమున భారతదేశములో ఫ్రాంతీయ భాషలకు సంస్కృతమువలన కలుగు పరిపుష్టి వర్ణనాతీతము. ఏభావమునైనను, భావచ్చాయనైనను తెలుపగల పదములు సంస్కృతములో సిద్ధములై యుండుటయేకాక అవసరమైనకొలదియు నూతన పదములను సృజించుకొను అవకాశము ఇందున్నంత పుష్కలముగా మరి యేభాషలోను లేదు. ఆయా ధాతువులకు చేర్చబడు ఉపపర్గల వలనను తిఙకృత్ప్రత్యయముల వలనను అనంతపదజాలము కల్పింపబడుట కవకాశమున్నది. అట్లే సుబంత తద్ధిత రూపములును కొల్లలుగా సంపాదింపబడును. ఒక్కధాతువునుండి సుమారు 150 పదములను సృజించు అవకాశము సంస్ృతములోసంస్కృతములో కలదు. ఇట్టి యవకాశము మరి యే భాషలోను లేదు. ఇంత భాగ్యవంతమును, సమృద్ధి మంతమును అయిన భాష ఆధునికయుగములో నిర్వహింపవలసిన కార్య మెంతయో కలదు.
 
బహువిధోద్యమములతోను, వైజ్ఞానిక సంచలనములతోను చైతన్యవంతమైన ఆధునిక కాలములో సంస్కృతము చేయుచున్నట్టియు, చేయగల్గినట్టియు సహాయ మింతింతయని చేప్పజాలముచెప్పజాలము. సంస్కృతసహాయముసంస్కృత సహాయము లేనిచో సుమారు అర్థశతాబ్దినుండి ఆంధ్రరేశములోఆంధ్రదేశములో ( అట్లే యితర భాషాప్రాంతములలో ) విజృంభించుచున్న అనేకోద్యమము లింతగా ప్రజల హృదయములను తాకెడివికాదు. గ్రంధాలయోద్యమము, వయోజన విద్యాప్రచారము, సహాయ నిరాకరణోద్యమము, గ్రామ్య, గ్రాంధికభాషా వివాదము, భావకవిత్వ ప్రస్ధానము, సారస్వత విమర్శనము, చారిత్రక పరిశోధనము - అది యిది యననేల – ఆధునిక జీవిత విజృంభణ మంతయు సంస్కృత భాషావలంబనము చేతనే జరిగినది. సంస్కృతమునకా పటుత్వమున్నది. ఏయుద్యమము బయలుదేరినను అది ప్రజల హృదయములలో నాటుకొనిపోవులనట్లు చేయగల అమోఘఅమోఘమైన శక్తి సంస్కృతభాష కుండుటచేత సంస్కృతముద్వారా ఉద్యమములు వ్యాపించుటయే కాక ఉద్యమములద్వారా సంస్కృతభాష కూడ అపారముగా వ్యాపించిపోయినది. ఏమాత్రము విద్యాగంధము లేనివారికికూడ ఆయాయుద్యమ భావములతోఁబాటు సంస్కృతభాషా పదములుకూడ అందఁజేయఁబడినవి. తత్ఫలితముగా నేఁడు సంస్కృత పదములు వెనుకకంటె హెచ్చు వ్యాప్తిలోనికి వచ్చినవి. మునుపు సంస్కృత పండితులకు మాత్రమే యర్థమగుచుండిన కొన్ని సంస్కృతపదములు నేడు సామాన్యజనుల కర్ధమగుచున్నవి.
 
1920 వ సంవత్సరమునకు పూర్వము మనదేశములో "గ్రంథపఠనము”, “స్వార్థపరుడు”, “దృఢసంకల్పము” మున్నగు పదములకు అర్థమేమని దారినిపోవువాని నెవ్వని నైనను అడుగుచో అతడు తెల్లబోయెడివాడు. నేడు ఆంధ్రపత్రిక, ఆంథ్రప్రభ మున్నగు పత్రికలను చదువు సామాన్యజనుడు కూడ వీనియర్ధమును గ్రహించగల్గుచున్నాడు. కారణమేమి? ఆయా ఉద్యమములతోపాటు ఇట్టి పదములు కూడ ప్రజలకు పరిచితములైపోయినవి. మనకు తెలియకుండగనే సంస్కృతము మనకు సహాయము చేయుచున్నది. అది సమస్తాధునికోద్యమములకు సహాయము చేయుచు, అన్నింటి మూలముననుకూడమూలమునను కూడ వ్యాప్తిచెందుచు తన విలక్షణప్రభావమును లోకమునకు చాటుచున్నది.
 
ఆధునిక నాగరికతకును సంస్కృతభాషకును ఇట్టి సంబంధము కలదు. ఇది భారతదేశములోని అన్ని ప్రాంతీయ భాషలకును వర్తించును. కావుననే భారత కేంద్రప్రభుత్వమునకు అధికారభాష కావలసిన హిందీ పదములను స్వీకరింపవలసినపుడు ముఖ్యముగా సంస్కృతమునుండియు, తరువాత ఇతర భారతీయభాషల నుండియు (...by drawing, whereever necessary or desirable, for the vocabulary, primarily on Sanskrit and secondarily on other languages) స్వీకరింపవలయుననని భారత రాజ్యాంగ ప్రణాళికలో ఉపనిబద్ధమైయున్నది. (Part XVII, Chapter IV, 351)
 
భారతదేశములోనేకాదు, ఇతరదేశములలో కూడ ఆధునిక వ్యవహారములకు సంస్కృత సహాయము పొందబడుచున్నది. సయాం, జావా మున్నగు దేశములలో దేశీయ భాషలు ఆధునిక వ్యవహారములకు ఉపయోగవడుటకై పరిపుష్టిని సంస్కృతభాషనుండి పొందుచున్నవి. సింహళ విశ్వవిద్యాలయాచార్యులైన శ్రీ వి. జి. సేకరేస్వీయసేకరే స్వీయ దేశ భాషాభివృద్ధి మార్గమును నిర్దేశించుచు నుడివిన యీమాటలు గుర్తింపదగినవి. “ఇంత కాలముపేక్షింపబడిన దేశీయభాష త్వరలోనే గురుతర బాధ్యతలను వహింపవలసివచ్చును. ఈ దేశీయభాషాభీవృద్ధిసందర్భమున మనకు ప్రధానమైన స్ఫూ ర్తి సంస్కృతభాషనుండి రావలసియున్నది. దీనినెల్లరు నంగీకరింతురు. విపులమైన శబ్దజాలము, శాస్త్రీయపారిభాషిక పదసమూహము సంస్కృతమున కాస్థానమును గల్గించుచున్నవి. సంస్కృత ధాతువుల నాధారముగా చేసికొనియే మనము నూతనపదములను నిర్మించుకొనవలసి యున్నది.” (22-6-54 తేదీని జాఫ్నాలో జరిగిన సంస్కృత మహాసభలోని ఉపన్యాసము.)
 
భారతదేశములోని యే ప్రాంతీయ భాషాసాహిత్యములోనైనను ప్రవేశించుటకు గాని గ్రంథరచనగావించుటకుగాని సంస్కృతభాషాజ్ఞానము తప్పనిసరిగా నుండదగినది. ఈ సంస్కృతప్రభావము ప్రాచీనరచనలలోను, అర్వాచీనరచనలలోను సమానముగానే యున్నది. ప్రాంతీయభాషాప్రత్యయములను తొలగించి సంస్కృత ప్రత్యయములను చేర్చుచో సంస్కృతభాషగానే మారిపోవు రచనలు నాడును నేడును గూడ సర్వ ప్రాంతీయభాషలలోను కలవు. సంస్కృతపదభూయిష్టములైన రచనలే అన్ని ప్రాంతీయభాషలలోను జనసామాన్యముచే ఆదరింపబడుచున్నవి. ఏగ్రంథములు సంస్కృతపదములను వాడరాదను అభిప్రాయముతో కవులచే రచింపబడినవో ఆ గ్రంథములే కృతిమములుగాను, కఠినములుగాను గన్పట్టుచున్నవి. ధారాళముగా సంస్కృత పదములు ప్రయోగింపబడిన గ్రంధములు జనసామాన్యమున కర్థమగుచున్నవి. కొన్నిపట్ల సంస్కృతపదభూయిష్ఠరచనయుసంస్కృతపదభూయిష్ఠ రచనయు కఠినముగా నుండవచ్చును. కాని యా కాఠిన్యమునకుకాఠిన్యతనకు కారణము ఆపదములు సంస్కృతపదములై యుండుటకాదు. అట్టిపదములు సంస్తృతగ్రంథములలోనున్నను ఆ గ్రంథములు సంస్కృత పండితులకు కఠినముగానే యుండును. వానికి బదులుగా తేలికయైన సంస్కృతపదములు వాడబడుచో ఆ రచన తెలుగు గ్రంథములోనున్నను తేలికగనే యుండును. సంస్కృతగ్రంథములలోనున్నను తేలికగానే యుండును. కావున కాఠిన్యసౌలభ్యములుకాఠిన్య,సౌలభ్యములు ఆ ప్రయుక్తపదములకు సంబంధించినవే కాని భాషకు సంబంధించినవి కావు.
 
నేటి భారతీయ భాషాసాహిత్యములతో సంస్కృతమునకు గల గాఢసంబంధము గట్టిగా మనస్సునకు తట్టవలయున్న్నచోతట్టవలయునన్నచో అప్పుడప్పుడు జరుగుచుండు సర్వప్రాంతీయ కవిసమ్మేళమములోకవిసమ్మేళనమములలో పద్యములను మనము వినవచ్చును. ఇంచుమించు అన్నిప్రాంతీయభాషలలోనుఅన్ని ప్రాంతీయభాషలలోను అవే సంస్కృత పదములు విననగును; భిన్నభారతీయ భాషలనడుమ ఎంత ఐక్యముకలదోఐక్యతకలదో స్పష్టముగ గోచరించును.
 
నేటి మన వ్యవహారరంగములోను, సాహిత్యరంగములోను సంస్కృతమెంత సన్నిహిత సంబంధమును గల్గియున్నదో, సంస్కృతాభ్యాసము పెరుగుచో ఈ ఉభయరంగములలోను మన భాషాపాటవ మెంతగా పెరుగునో, జాతీయజీవన మెంత సౌభాగ్య వంతముగానుండునో పై విచారణమువలన తెలియగలదు. నవయుగములో సంస్కృత పునరుజ్జీవనముపునరుజ్జీవము ప్రాంతీయభాషా పునరుజ్జీవనములోపునరుజ్జీవములో నొక ముఖ్యభాగముగా భావింపవలయుననియు, సర్వప్రాంతీయ భాషలలోను సంస్తృతపదజాలముసంస్కృతపదజాలము పెరుగుచున్న కొలదియు భిన్నభిన్న ప్రాంతములవారు పరస్పరము దగ్గరకు చేరుకొనుటకును, భారతీయులలో ఏకజాతీయభావము ఇతోధికముగా సునిరూఢముగుటకునుసునిరూఢమగుటకును దోహదమేర్పడుననియుకూడ దీనివలన స్పష్టమగుచున్నది.
 
====శబ్దశక్తి====
"https://te.wikipedia.org/wiki/సంస్కృతం" నుండి వెలికితీశారు