పంచె: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q850794 (translate me) |
→వివిధ శైలులు మరియు రకాలు: గ్లాస్గో |
||
పంక్తి 31:
సాధారణంగా తెలుపు దానికి సంబంధించిన రంగులో (క్రీం కలర్) ఉన్నా, మతసంబంధిత కార్యక్రమాలు లేదా ప్రత్యేక సందర్భాలలో వేరే రంగులు వాడతారు. ఉపనయనాలకి పసుపు/తెలుపు లలో లభ్యమయ్యే (తమిళనాడులో మగతం అనే) పట్టు పంచెలు ధరిస్తారు. సింధూర వర్ణంలో ఉండే సౌలే అనబడు పంచెలు మహారాష్ట్రలో గుళ్ళలోని అర్చకులు వాడతారు. రాజుల, కవుల పట్టు పంచెలు ముదురు రంగులతో ఉండగా బంగారు దారాలతో వాటికి ఎంబ్రాయిడరీలు ఉండేవి. రోజువారీ వినియోగానికి నూలు పంచెలు ఉత్తమం. పట్టు పంచెలు ఖరీదు ఎక్కువ. వీటిని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వాడతారు.
ఉదర భాగం/పొత్తి కడుపు నుండి రెండు కాళ్ళ మధ్య నుండి వెనక్కి వెళ్ళేలా ధోవతిని కడతారు. కొన్ని ప్రాంతాల (ఎక్కువగా [[రాయలసీమ]])లో ధోవతిని పంచెకట్టుతో ధరిస్తారు.
'''పంచెకట్టు:''' చీరకు వేసే కుచ్చిళ్ళ అంత ఒద్దికగా పెద్దగా కాకుండా, దాదాపు అదేవిధంగా, చిన్నగా నడుముకు ఒక వైపు మాత్రమే గానీ, ఇరువైపుల గానీ, రెండువైపులు బయటకు గానీ లోపలకుగానీ దోపుతారు. (ఒకటి బయటికి, ఇంకొకటి లోపలికి దోపరు.)
|