కాశీ కృష్ణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Kasikrishnacharyulu.png|right|250px|thumb|కాశీ కృష్ణాచార్యులు]]
“అవధాని శిరోమణి” బిరుదు అందుకున్న సంస్కృతాంధ్ర విద్వాంసులు, అనేక భాషలు నేర్చిన పండితులు. సంగీతం, వీణా వేణూ,వయోలిన్ మృదంగాది వాద్యాలు, వడ్రంగం,కుమ్మరం, నేత,ఈత,వంటకం,వ్యాయామం,కుస్తి ,గారడీ మొదలైన చతుషష్ఠి కళలన్నీ నేర్చిన మహా మనీషి.
 
కాశీ కృష్ణాచార్యులు ఒకప్పుడు ఆంధ్రప్రదేశపు ఆస్థాన విద్వాంసులు. వారు కవి, పండితులు మాత్రమే కాదు, అవధానులు, సంగీత విద్వాంసులు కూడ. వారు సమస్యాపూరణములలో కష్టముగా నున్నట్లు తోచినప్పుడు,హయగ్రీవస్వామిని ప్రార్థించెడివారట. అట్టి ఒక పద్యము-
<poem>
భావమునందు నిన్నెపుడు బాసి యెఱుంగని వాడనయ్య, యో
పావన నామధేయ, నను బాలను ముంచిన నీట ముంచినన్
నీవ గదయ్య, దిక్కితరునిన్ మఱి వేడగబోవ నో హయ-
గ్రీ వవధాన వార్ధి నను రేవును జేర్పుము నీకు మ్రొక్కెదన్
</poem>
 
వీరు ప్రతి ప్రతి ప్రదర్శనమునకు ముందు, ఉపన్యాసమునకు ముందు అశ్వధాటి వృత్తములో స్తుతి చేయు వారట (నేను మీకు చెప్పిన వాదిరాజయతిది). అల్లసాని పెద్దన ఆశుకవిత్వ చంపకమాలిక సుప్రసిద్ధమైనది. దానికి దీటుగ రచించవలయునని ఆచార్యులు తలచి ఒక మాలికను రచించినారట.
 
ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతములపై ఆచార్యులు చెప్పిన పద్యము-
<poem>
ద్వైతము లుబ్ధ సుఖద మ-
ద్వైతము తస్కర సుఖప్రదంబు, విశిష్టా-
ద్వైతము యాత్రిక సుఖదము,
భూతలమున మొత్తమునకు మూడును మెఱుగే
</poem>
ఈ విషయములు ప్రసాదరాయ కులపతి వారి కవితామహేంద్రజాలములో చెప్పబడినవి.
 
==యితర లింకులు==
* [http://www.eemaata.com/em/printerfriendly/?id=1737 ఆయన అపురూపమైన భాషణం ఇచట వినవచ్చు]
* [https://groups.google.com/group/telugu-unicode/tree/browse_frm/thread/ab90455341aebaff/460d661d1fef12ae?_done=/group/telugu-unicode/browse_frm/thread/ab90455341aebaff/460d661d1fef12ae?tvc%3D1%26&tvc=1&hl=es&pli=1 ఆయన గూర్చి]
 
 
[[వర్గం:సంగీతకారులు]]