యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
ప్రాసంగికులు లేదా మాటకారులను కన్నడలో 'మాతుకారికె 'అందురు.ప్రాసంగికులన్న వాచలకులు అని కూడా అర్థం.భాగవతారు ఉపాఖ్యాన్యంను పాటరూపంలో ఆలపించిటం ముగించిన తరువాత,ఈ ప్రాసంగికులు భాగతారు పాటరూపంలో పాడిన కథనం యొక్క అర్థము/భావంను గద్యరూపం(మాటలలొ/వచనం)లో చర్చించెదరు.ఈ విధంగా చెయ్యడంలో ప్రధాన వుద్దేశ్యం, పద్యరూపంలోని కథనం అర్థంకాని పామరజనానికి కథనం అర్థం తెలియచెయుటకు.ప్రసంగికులు సామాన్యజనం మాట్లాడుకునే భాషలో కథనాన్ని వచనంలో వివరిస్తారు.
* '''నేపథ్యము(Back ground)''':
యక్షగానంలో నేపథ్యమును హిన్నెళ అందురు.అనగా యక్షగాన ప్రదర్శన జరుగుసమయంలో ప్రక్కనుండి అవసరమైన మేరకు సంగీత సహాకారం అందించె వాద్యబృందం.ఒకవిధంగా నేపథ్య సంగీతం అనచచ్చునేమో?.ఈ వాద్యబృందంలో చండడప్పు,మద్దెల,మృదంగము,జాఘంట మొదలగు సంగీతవాద్య పరికరాలను ఉపయోగిస్తారు.వీటిని నృత్యసమయంలో,భావవతారుపాడే సమయంలో,ప్రాసంగికులు మాట్లాడేటప్పుడు సందర్భోచితంగా వాయిస్తూ యక్షగానప్రదర్శనను రక్తికట్టించెదరు.అందువలన యక్షగానం\ ప్రదర్శన ఫలప్రదంకావాలన్నచో పాత్రధారుల అభినయం,భాగవతారు గానమాధుర్యం ఎంతముఖ్యమో.నేపథ్యసంగీయంకూడానేపథ్యసంగీతం కూడా అంతే ముఖ్యం.ముఖ్యంగా భాగవతారు గాత్రంకు ప్రాణం ఈ నేపథ్యవాద్యం.
==యక్షగాన విధానాలు ==
యక్షగానంను ప్రదర్శించుటలో అనేకరీతులు,పద్ధతులున్నప్పటికి బయలాట(వీధీభాగోతం)అత్యంత జనప్రియమైనది.బయలాట అనగా వస్త్రాలంకరణ,వేషాలంకరణ కావించుకొని వేదికభూమిపై ఆడే ప్రదర్శన.పండుగ,సంబారాల సమయాలలో వూరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రిఅతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి బయలాట అనే పేరురూడి అయ్యింది.ప్రజలు మాములుగా 'ఆట ' అనివ్యవరిస్తారు.కకాని ఈ మధ్యకాలంలో యక్షగాన ప్రదర్శన సమయంను కుదించి 2-3 గంటలు మాత్రమే ప్రదర్శించడం మొదలైనది.బయలాటలో ప్రదర్శన్లో- రంగస్థలం,భాగవతారు(గాయకుడు),అభినయం,చతురసంభాషణలు,నృత్యం ఇలా సంప్రదాయ యక్షగానంకు చెందిన అన్ని ఘట్త్టాలు\భూమికలు కనచచ్చును.యక్షగానంలో పశ్చిమ యాస ,తూర్పు యాస అను రెండు ప్రదర్శనరీతులున్నాయి.పశ్చిమప్రాంతపు తూర్పున ఆచరణలో వున్నది మడవలపాయ(తూర్పుదిక్కు యాస) ఆట,మల్నాడు(మలెనాడు,మలె:వాన)మరియు కరావళి ప్రాంతంలో అధిక ఆదరణవున్నది పశ్చిమ యాస(పడవలపాయ).పశ్చిమయాస ఆట లో మరియు 3 రీతు లున్నాయి,దక్షిన యాస ,భడగుయాస ,ఉత్తరదయాస
 
==ప్రముఖ యక్షగాన కళాకారులు==
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు