రేడియో: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
 
==సముద్రాన్ని దాటిన వైర్ లెస్ తరంగాలు==
1901 డిసెంబర్ 12 వ తేదీన మార్కోనీ తన సహాయకులతో బాటు న్యూఫౌండ్ లాండ్ లో ఒక చోట పాత పూరి గుడిసెలో కూర్చున్నాడు. మంచి శీతాకాలం, తుఫాను గాలులు గోడ పగుళ్ళలో నుంచి ఎముకలు కొరికేలా వీస్తున్నాయి. పై కప్పు రంధ్రాల నుంచి వర్షం పడుతోంది. కొద్దిపాటి కోకో,ఒక విస్కీ సీసా తప్ప తినడానికి యేమీ లేదు. వెలుపల గాలిపటం నుంచి వేలాడ దీసిన ఏరియల్ 400 అడుగుల ఎత్తున ఈదురగాలికిఈదురుగాలికి రెపరెపలాడుతోంది. సరిగా అదే సమయంలో 2,170 మైళ్ళ దూరంలో ఉండే పోల్డు(కార్నవాల్ రాష్ట్రం) నుంచి మోర్స్ కోడ్ ప్రకారం S అక్షరాన్ని ప్రసారం చేయాలని ప్రయత్నించారు. కానీ చాలాసేపు ఫోన్ లో అరగొర శబ్దాలు తప్ప మరేమీ స్పష్టంగా వినిపించలేదు. "భూమి గోళాకారంగా ఉండటం మూలాన విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించడానికి అవరోధ ముండదని నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నాను. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికైనా వాటిని ప్రసారం చేయవచ్చు---" అని మార్కోనీ అభిప్రాయపడ్డాడు. ఫోన్ లో సముద్రం ఆవలిపైపు నుంచి ఏవైనా సంకేతాలు వినబడతాయేమో అని ఆదుర్ధాఆదుర్దా గా నిరీక్షిస్తున్న మార్కోనీ అనుచరుడు 12-30 సమయంలో హఠాత్తుగా చేయి పైకెత్తి సైగ చేశాడు. వెంటనే మార్కోనీ ఫోన్ తీసుకుని చెవులు రిక్కించి విన్నాడు. మూడు పివ్ అనే శబ్దాలు మళ్ళీ మళ్ళీ వినబడసాగాయి. వైర్ లెస్ తరంగాలు సముద్రాన్ని దాటాయన్నమాట!
 
==విమర్శలు==
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు