హెచ్.ఎమ్.రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
 
తొలి [[తెలుగు సినిమా]] ‘[[భక్తప్రహ్లాద (సినిమా)|భక్త ప్రహ్లాద]]’ తీసినవారు '''హెచ్‌.ఎమ్‌.రెడ్డి'''.
 
1927 హైద్రాబాదులో చెలరేగిన ప్లేగువ్యాధికి భయపడి, చాలా కుటుంబాలు వేరే వూళ్లకి పారిపోయాయి. అలా వెళ్లిపోయిన వాళ్లలో, జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరు ఉద్యోగం చేస్తున్న హెచ్‌.ఎమ్‌. రెడ్డి కూడా వున్నారు. తన బావమరిది హెచ్‌.వి.బాబు బొంబాయిలో వుండి, సినిమాల్లో వేషాలకి ప్రయత్నిస్తున్నారని అక్కడికి తానూ వెళ్ళిపోయారు రెడ్డి. సినిమా వాతావరణం, సృజనాత్మకమైన కళలో ఆయనకు గల ఉత్సాహం రెండూ కలిసి, ఆయనలో సినిమా ఉత్సాహం కల్పించాయి. తను కూడా అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు.
 
 
1930లో ఇంపీరియల్‌ కంపెనీకి ‘విజయకుమార్‌’, 1931లో ‘ఎ వేజర్‌ ఇన్‌ లవ్‌’ అన్న రెండు మూకీలను హెచ్.ఎమ్.రెడ్డి డైరెక్ట్‌ చేశారు. రెండు చిత్రాల్లోనూ [[పృథ్వీరాజ్‌ కపూర్‌]] ముఖ్యపాత్రధారి. అలా - శబ్దరహిత చిత్రాలు తీసి హెచ్‌.ఎమ్‌.రెడ్డి, 1931లో శబ్దసహిత చిత్రాలు తీశారు. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి [[తెలుగు]]లోనూ, [[తమిళం]]లోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక ‘[[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]]’ని ఆయనకు అప్పజెప్పారు. అలాగే ‘కాళిదాసు’ కూడా తమిళంలో తీశారు రెడ్డి.
 
 
"https://te.wikipedia.org/wiki/హెచ్.ఎమ్.రెడ్డి" నుండి వెలికితీశారు