ముండకోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
కళ్ళు మొదలైన జ్ఞానేంద్రియాలకు గోచరం కానిదీ, చేతులూ మొదలైన కర్మేంద్రియాలకు దొరకనిదీ, ఉత్పత్తి లేనిదీ, రంగులేనిదీ, కళ్ళు చెవులు, కాళ్ళూ చేతులు లేనిది, శాశ్వతమైనదీ, అంతటా వ్యాపించినదీ, అత్యంతమూ సూక్ష్మమైనదీ, సృష్టికి మూలకారణమైనది అయిన ఆ అక్షరతత్వాన్ని జ్ఞానులు సకల జగత్తుకూ మూలంగా అంతటా చూడగలరు.
 
<poem>
యథోర్ణ నాభి: సృజతే గృహ్ణతే చ
యథా ఫృథివ్యామ్‌ ఓషధయ: సంభవంతి |
యథా సత: పురుషాత్‌ కేశలోమాని
తథా క్షరాత్ సంభవతీహ విశ్వమ్‌ ||
</poem>
 
సాలె పురుగు ఎలా తన గూడును నోటినుండే వెలికితీసి తనలోకే తీసుకుంటుందో, భూమినుండి మూలికలన్నీ ఎలా ఉద్భవిస్తాయో, మానవును తలమీదా శరీరంమీదా ఏ ప్రయత్నం లేకనే వెంట్రుకలు ఎలా పెరుగుతాయో అలాగే ఆ అక్షరతత్త్వంనుండి ఈ విశ్వం ఉత్పన్నమవుతుంది.
 
<poem>
తపసా చీయతే బ్రహ్మ తతో న్నమభిజాయతే |
అన్నత్‌ ప్రాణో మన: సత్యం లోకా: కర్మసు చామృతం ||
</poem>
 
తపస్సువల్ల ధర్మం పెంపొందుతుంది. ఆ బ్రహ్మంనుండి అన్నం పుడుతుంది. ఆ అన్నంనుండి ప్రాణశక్తి, మనస్సు, పంచభూతాలు, లోకాలు, కర్మలు, అన్నీ ఉద్భవించాయి.
 
<poem>
య: సర్వజ్ఞ: సర్వవిద్యస్య జ్ఞానమయం తప: |
తస్మాదేతద్‌ బ్రహ్మ నామరూపమన్నం చ జాయతే ||
</poem>
 
సృష్టికర్త, సర్వవిదుడు, జ్ఞానమే తపంగాగల బ్రహ్మ సకల ప్రాణులు వాటి ఆహారం అన్నీ పరబ్రహ్మంనుంచి ఉద్భవిస్తున్నవి.
 
;ద్వితీయ ఖండం
 
* భారత రాజముద్రికపై గల నినాదం [[సత్యమేవ జయతే]], ఈ ఉపనిషత్తునుండే స్వీకరించారు.
"https://te.wikipedia.org/wiki/ముండకోపనిషత్తు" నుండి వెలికితీశారు