పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
పెరుగులో పెసరపప్పు, [[శొంఠి]], [[పంచదార]] , [[ఉసిరి]]కాయ పొడి చేర్చి తింటే అధికమైన ఉపయోగాలు పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే పూర్తిగా తోడుకోని పెరుగును కూడా తినవద్దని ఆయుర్వేదంలో ఉంది. అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగుని నిరభ్యంతరంగా వాడుకోవాలని ఆయుర్వేద సూచన. ఎంతమంచిదైనా వేసవికాలం ఎక్కువ తీసుకోరాదు. అలాగె ప్రతిరోజూ క్రమం తప్పకుండా తినకూడదు. పెరుగులో తియ్యనిది,పుల్లనిది,బాగా పుల్లనిది అని సుకృతుడు వివరించాడు. అలాగే పెరుగు వాడటం వలన శరీరానికి చాలా ఉపయోగం అని చరకుడు కూడా తెలిపాడు.
==పెరుగు-ఆహారంలో అమృతం==
మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. ఏదైనా ఫెర్మెంటో పాలనే పెరుగు అనడం అర్థవంతంగా లేకపొయినా, పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి. రష్యాలో గొర్రెలు,మేకలు పాలనించి కూడా పెరుగు తయారుచేస్తాలు.
 
==చరిత్ర==
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు