మహావీరాచార్య (గణిత శాస్త్రవేత్త): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
==మహావీరుని గణిత భావనలు==
మహావీరుని అంకశ్రేణి నిరూపణ యందలి విశేష విషయమేమనగా అతడు భిన్నాంకాత్మములగు అవృత్తులను శ్రేఢి యార్థం గ్రహించెను. యితనికి ముందు వెలువడిన గ్రంథాలలో కానరాని అమూల్య భావమిది. సంకలన, గుణోత్తర శ్రేఢులందు, వీటి సమ్మేళనములందు, తారసిల్లు అనేక సమస్యలను అతడు ఉటంకించి యున్నాడు. స్పష్టతతో గూడినది వివరించాడు. బ్రహ్మగుప్తుని గ్రంథములందు వలెనే గణిత సార సంగ్రహమందు కూడ ప్రస్తారములు, సంయోగములు, చందో సూత్రములకు అన్వయించు రీతి నిరూపింపబడినది. బ్రహ్మ గుప్తుని గ్రంథంలో ఉన్న అస్పష్టతకు యిందులో తావులేదు. ఆరు జాతుల భిన్నాంక యోగములు సరళీకరించెను.
# భాగజాతి
# ప్రభాగజాతి
# భాగానుబాగ జాతి
# భాగావవాహ జాతి
# భాగజాతి
# భాగ మాతృజాతి
 
మహావీరుని ఉద్దేశం ప్రకారం ఇట్టి ప్రభేదకములు 26 కలవు:
 
భిన్నాంకముల యొక్క హారముల క.సా.గు నకు మహావీరుడిచ్చిన పేరు "విరుద్ధం". ఈ పదం, ఈ పదానుషక్తమయిన భావం మొదట గణిత సర సంగ్రహం నందు మనకి కనిపిస్తుంది.
 
సరళ భిన్నముల గురించిన అనేక జాతులు, లేదా వర్గ సమీకరణముల సమస్యలను ఇతడు సాధించెను. ఏ భిన్నాంకమునైనను ఒక ఏక లవ భిన్నాంక పరంపర సంకలనముగ నిరూపించుటకు కావలసిన సూత్రములు అనేకము కలవు. వాటికి మహావీరుడు వివరణములిచ్చెను. వాటికనేక ఉదాహరణములిచ్చెను.
 
==ఉన్నత శ్రేణి సమీకరణములు==