వర్ణము(సంగీతం): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{భారతీయ సంగీతం}} వర్ణము అభ్యాసగాన రచనలలోచాలా ముఖ్యమైన రచన. ఈ ర...
 
పంక్తి 4:
వర్ణమును రచించుట కష్ట సాధ్యము. కృతుల సంఖ్య కంటే వర్ణముల సంఖ్య చాలా కొద్ది. వర్ణము రచించుటకు రాగము యొక్క లక్షణములు పరిపూర్ణముగా తెలిసికొని ఆ రాగములో వర్ణమును రచింపవలయును.
==లక్షణము==
వర్ణమునకు రెండు భాగములు, పూర్వ భాగము,ఉత్తర భాగము. పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరములు గల భాగము పూర్వభాగము. చరణము,చరణ స్వరములు కల భాగము ఉత్తర భాగము.
 
పూర్వ భాగమున పల్లవి, అనుపల్లవి, ముక్తాయీ స్వరము యిమిడి యున్నవి. పల్లవి, అనుపల్లవులకు సహిత్యము కలదు. ముక్తాయీ స్వరము నము సాహిత్యముండదు. రచించిన రాగములో ఏ ఏ విశేష సంచారములు వచ్చుటకు వీలున్నవో, రాగ రంజక ప్రయోగము లేవో అన్ని రకములైన సంచారములను వర్ణనము నందు కాననగును. ఒక భాష నేర్చికొనుటకు, నిఘంటువును ఎట్లు ఉపయోగించుదుమో ఒక రాగము లోని వర్ణము ఆ రాగము యొక్క్ లక్షణమునకు అంత ఉపయోగించుదురు.
 
వర్ణము లో సాహిత్యము చాల కొద్ది అక్షరములు కలిగి యుండును. సాధారనముగా శృంగార రసము గాను, భక్తిని దెల్పునదిగాను, లేక ఒక రాజపోషకు స్తుతీ గాను ఉండును.
 
ఉత్తర భాగములో చరణము, చరణ స్వరములు ఇమిడి ఉన్నవి. చరణమునకు ఉపపల్లవనియు, ఎత్తుగడ పల్లవి అనియు, చిట్ట పల్లవి అనియు పేర్చు. సాధారణముగా మొదటి స్వరము దీర్ఘ స్వరముగా నుండును. 4 లేక 5 చరనములతోనే వర్నమును రచించుట వాడుక. చరణ స్వరము పాడి, మరల చరణమును అందుకొనుట ఆచారము. కొన్ని వర్ణములకు రెండువ పల్లవులుండును.
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/వర్ణము(సంగీతం)" నుండి వెలికితీశారు