పూనూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఈ గ్రామం లో మూడు ప్రాధమిక పాఠశాలలు,ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఇక్కడ తపాళా కార్యాలయం, టెలిఫోన్ ఎక్సేంజి ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ హొమియోపతి డిస్పెన్సరీతో బాటు ఆంధ్రా బ్యాంక్ కూడా ఉన్నాయి. [[నాగార్జున సాగర్]] కాలువ ద్వారా సాగు నీటి వసతి కలిగిన ఈగ్రామంలో ఎక్కువశాతం నల్లరేగడి నేలలు. సుమారు 5300 ఎకరాల పంట పొలాలలో 1000 ఎకరాలవరకు మాగాణి. మెట్టపొలాలలో మినుము, శనగ, [[మొక్కజొన్న]], [[మిరప]], జూటు, [[ప్రత్తి]] ముఖ్యమైన పంటలు.ఇటీవల కొద్ది విస్తీర్ణంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు. గ్రామంలో 14వ శతాబ్దంనాటి త్రిపురాంతకస్వామి, వీరభద్రస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలు ఉన్నాయి. 2-5-1998న ప్రారంభించబడిన శ్రీ రామక్రిష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి [[కన్యాకుమారి]]లోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది. గ్రామంలో రక్షిత మంచినీటి పధకం నిర్మించబడినా, గత 15 సంవత్సరాలుగా పని చేయటం లేదు. దీన్ని పునరుద్ధరించటానికి స్థానిక స్వఛందసంస్థ శ్రీ రామక్రిష్ణ శారదా మండలి ఇటీవలనే ప్రయత్నాలు ప్రారంభించింది.
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 6038
*పురుషులు 2976
*మహిళలు 3062
*నివాసగ్రుహాలు 1564
*విస్తీర్ణం 1996 హెక్టారులు
*ప్రాంతీయబాష తెలుగు
===సమీప గ్రామాలు===
*గన్నవరం 4 కి.మీ
*ఇడుపులపాడు 4 కి.మీ
*తనుబొద్దివారిపాలెం 4 కి.మీ
*చిమటవారిపాలెం 4 కి.మీ
*ద్రోణాదుల 5 కి.మీ
===సమీప మండలాలు===
*పశ్చిమాన మార్టూరు మండలం
*తూర్పున పరుచూరు మండలం
*దక్షణాన ఇంకొల్లు మండలం
*దక్షణాన జనకవరం పొంగులూరు మండలం
 
==వెలుపలి లింకులు==
 
"https://te.wikipedia.org/wiki/పూనూరు" నుండి వెలికితీశారు