పూర్ణోత్సంగుడు: కూర్పుల మధ్య తేడాలు

కొంత విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పూర్నోత్సంగుడు''' [[శాతవాహనులు|శాతవాహన]] రాజులలో నాల్గవ వాడు. శ్రీ శాతకర్ణి కుమారుడు. ఇతను క్రీ.పూ.179, 161 మధ్య ఆంధ్ర దేశాన్ని పరిపాలించాడు. ఇతని కాలంలో రాజ్య విస్తరణ జరగలేదు. ఇతడు ఒక నామ మాత్రపు రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు. 18 సంవత్సరాల పాటు పాలించాడు.
 
ఈయన జన్మనామం వేదిసిరి శాతవాహన. పూర్నోత్సంగుడు ఆయన యొక్క బిరుదు. అయితే పురాణాల్లోని ఆంధ్ర రాజుల జాబితాల్లో ఎక్కడా వేదసిరి శాతవాహన అన్న పేరు కనిపించకపోవటం వలన ఇద్దరూ ఒకటే అన్న విషయం ఖచ్చితంగా తేలలేదు.<ref>[http://books.google.com/books?id=EBnqAAAAMAAJ&pg=PA72&lpg=PA72&dq=purnotsanga#v=onepage&q=purnotsanga&f=false Report on the Elura Cave Temples and the Brahmanical and Jaina Caves in ...By James Burgess, Georg Bühler]</ref> పూర్నోత్సంగుని ప్రస్తావన మత్స్య, బ్రహ్మాండ, విష్ణు, భాగవత పురాణాల్లో ఆంధ్రభృత్యుల వంశానుక్రమణికలో ఉన్నది. భాగవత పురాణంలో పౌర్ణమాసగా పేర్కొనబడ్డాడు. వాయుపురాణంలో మాత్రం ఈయన పేరు లేదు.<ref>[http://books.google.com/books?id=ykZmAAAAMAAJ&pg=PR66&lpg=PR66&dq=purnotsanga#v=onepage&q=purnotsanga&f=false Catalogue of the Coins of the Andhra Dynasty, the Western Kṣatrapas, the ...edited by British Museum. Dept. of Coins and Medals]</ref><ref>[http://books.google.com/books?id=Kos-AAAAcAAJ&pg=PA195&lpg=PA195&dq=purnotsanga#v=onepage&q=purnotsanga&f=false Works: Vol. 9 : The Vishṅu Purāṅa: a system of Hindu mythology ..., Volume 9 By Horace H. Wilson]</ref>
 
పురాణాల అనుసారంగా శ్రీ శాతకర్ణి మరణించిన తర్వాత, ఆయన కుమారుడు పూర్నోత్సంగుడు సింహసనాన్ని అధిష్టించాడని తెలుస్తున్నది. ఈయన పాలనాకాలంలో భారతదేశంలో సమకాలీన రాజులైన మగధకు చెందిన పుష్యమిత్ర సుంగ, కళింగ చక్రవర్తి ఖారవేలుడు మరణించారు.
"https://te.wikipedia.org/wiki/పూర్ణోత్సంగుడు" నుండి వెలికితీశారు