ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 37:
ఇంద్రగంటి గారి మాటలలో''' వంశీ....'''
 
''ఎలాచూడాలో.ఎక్కడచూడాలో,ఎందుకు చూడాలో,చూపించడం మంచిరచనకు,మంచి రచయితకు ప్రమాణమనుకుంటాను......ఇన్ని వాక్యాల నాఘోష సారాంశం,పాండిత్య ప్రగల్భతకంటె ప్రత్యక్ష జీవితానుభవ ప్రగల్భత ఎప్పుడూ గొప్పదని.ఇందుకే యీ కథలరచయిత,వంశీ అంటే గౌరవము.ఇంకొందుకు కూడా ఈయన కథలపట్ల గౌరవము.ఇవి ఆరుబయళ్లలలో,కొండ కోనల్లో,గోదావరి వడిలో,పల్లెల వీథుల్లో,వెన్నెల్లో.వానల్లో తిరిగినవి,తడిసినవి,తనిసినవి.....ఈయనకు జీవితంలోని రాగవైరాగ్యాలు,అందాలు,వికారాలు పుష్కలంగా తెలుసు.మనుష్యుల్ని వాళ్ళ బలహీనతలతో సహా ప్రేమించడం తెలుసు.వెన్నెల వర్షం,గోదావరి,అంతగా అనుభవించి పలవరించడం బహుశా చాలా కొద్ది మంది రచయితలు చేసి వుంటారు.....సంగీతమంటే ప్రాణంపెట్టె వంశీ,కవిత్వం జోలికి-పోనీ,కవిననిపించుకుందామనే కోరిక జోలికి-పోయిన జాడలు కనిపించవు......వంశీ,కవిత్వహృదయంతో కథలు చెపుతారని మీకు యీ కథలు చెపుతాయి.ఈ కథల్లో ముఖ్యమైన ఆకర్షించే బలం,ఈ రచయిత ఆయా మనుష్యుల్ని చూపిస్తూ చిత్రించే వాతవరణంవాతావరణం.ఈ DETAIl వీటి ప్రాణం.వంశీలో ఒక ECENTRIC భావుకత్వం(UNCONVENTIONAL AND STRANGEఅని నా ఉద్దేశం)'శిల,'బొత్తిగా అర్థంకాని మనిషి''కల వంటి కథల్లో పై చెయ్యిగా కన్పిస్తుంది.ఈయన వెల్లడించే వర్షాలు,రాత్రులు,వెన్నెల,గోదావరి రేవులు,ఇసుక బయళ్ళు PICTURESQUE గా వుండి,కవిత్వానుభవాన్ని పంచి పెడతాయి.మట్టినీ,గాలినీ ప్రేమింపజేస్తాయి.ఒక్కొక్కసారి,కథను పాత్రలు నడిపితే,ఒక్కొక్కసారి అనుభవాల వత్తిడిలోనుంచి కోలుకునే ప్రయత్నంగా ,తన నుంచి తన్ను విముక్క్తం చేసుకోవడానికా!అన్నట్లుగా,వంశీ తానే కథను నడుపుతాడు.జీవితాన్ని అన్ని రకాల ఒడిదుడుకులతో ప్రేమించే కథలంటే నాకిష్టం.బహుశా చాలా మంది కిష్టం.వంశీ అటువంటి,ఇటువంటి కథలు రాసినందుకు నాకిష్టం.''
 
ఇందులోని కథలు 1975నుండి 2007 వరకు వ్రాసినవి.ఈ కథలలో మూడు,నాలుగు కథలు తప్ప మిగిలినవన్ని ఆంధ్రజ్యోతి,స్వాతి వారపత్రికలలో అచ్చయ్యినవ్వే.
పంక్తి 44:
1. కరైకుడి నాగరాజన్; 2. బాచి; 3. నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి గ్రామం; 4. అలా అన్నాడు శాస్త్రి; 5. సీరియల్ రాత్రులు; 6. ధారావహికం; 7. ఒక అనుబంధం-ఒక ప్రారంభం; 8. ది ఎండ్; 9. బొత్తిగా అర్ధం కాని మనిషి; 10. ఆ ఏటి గట్టు; 11. శిల; 12. బాబురావు మేష్టారు; 13. ఒకరోజు; 14. ఎర్రశాలువ; 15. నల్లసుశీల; 16. ఆనాటి వాన చినుకులు; 17. ఒకశిథిలమైన నగరం; 18. కాకినాడలో రైలు బండెక్కి కోటిపల్లి వెళ్ళాం; 19. ఉప్పుటెరుమీద ఒక ఊరు; 20. రాజమండ్రిలో కైలాసం; 21. సీతారామా లాంచీ సర్వీస్-రాజమండ్రి; 22. రాజహంసలు వెళ్లిపోయాయి మరియు 23. కల
 
ఈ కథల్లో 'కారైకుడి నాగరాజన్','శిల','బాబూరావు మేష్టారు'అనే మూడు సంగీతము ఇతివృత్తంగా నడిచిన కథలు. 'అలా అన్నాడు శాస్త్రి', 'ఆనాటి వాన చినుకులు' అనేవి కవిత్వపు నేపథ్యంలో పుట్టినవి. 'ది ఎండ్', 'బొత్తిగా అర్థం కాని మనిషి', 'ఒక అనుభవం ఒక ప్రారంభం' అనే కథలు వ్యక్తిగత సదసత్సంశయాల్లోంచి ఆవిర్భవించినవి. 'ఒక శిథిలమైన నగరం అనే కథ-శిథిల హంపి గురించి, 'రాజహంసలు వెళ్ళిపోయాయి'అను కథ యానాం-ఎదుర్లంక మధ్య గోదావరి పై వంతెన నిర్మాణ నేపధ్యం లో రాసినది. ఇక 'సీతారామా లాంచీ సర్వీస్-రాజమండ్రి' అనే కథ నేపధ్యం-కొత్తగా పెళ్ళైన ఒక యువజంట తమ హనీమూన్ ను సీతారామా లాంచిలో రాజమంద్రి నుండీనుండి పాపికొండల వరకు ప్రయాణిస్తూ జరుపుకోవడం, ఆ సమయంలో లాంచీవారితో పరిసరగ్రామ వాసులతో వారి సంబంధాలను మనోహరంగా వర్ణిస్తూ సాగుతుంది. ప్రస్తుతం చర్చలో వున్న పొలవరం డ్యాము నిర్మిస్తే, లాంచీలను నమ్ముకు బ్రతుకుతున్నవారి బ్రతుకులు ఎలా కకలావికలమవ్వుతాయో, గోదావరి వడ్డునున్న ఎన్ని గిరిజన గ్రామాలు నీటమునిగి, అక్కడి ప్రజలు వలసపొయ్యే స్ధితిని, కలిగే నష్టాన్ని కన్నులకు కట్టెటట్లు రాసేడు వంశీ. మిగిలిన కథలన్నీ మనుష్యుల్నీ, జీవిత మర్మాల్నీ, పరిశీలించిన అనుభవాలనుండి పుట్టినవి. ఈ కథలలోని పాత్రలు మన జ్ఞాపకాలలో వెంటాడుతునే వుంటాయి.
 
===కరైకుడి నాగరాజన్===
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు