శివ (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: మరింత
→‎కథ: సమాప్తం
పంక్తి 17:
ఇటువంటి కళాశాలలో శివ ([[అక్కినేని నాగార్జున]]) విద్యార్థిగా చేరతాడు. మల్లి ([[శుభలేఖ సుధాకర్]]), ఆశ([[అమల]])తో స్నేహం కలుగుతుంది. అమ్మాయిలను ఇబ్బంది పెట్టటం, అధ్యాపకులని అవమానపరచటం వంటి పనులతో అల్లరి చేస్తున్న జెడి కి శివ తారసపడతాడు. మొదటి సారి స్నేహితుల అభ్యర్థన మేరకు జెడిని క్షమించినా రెండవసారి శివని జెడి కవ్వించి రెచ్చగొట్టటంతో సైకిల్ చైనుతో జెడి, అతని అనుచరులపై తిరగబడతాడు. అంతేకాక కళాశాల ప్రాంగణంలోనే జెడి ని వెంబడించి అతనిని అతికిరాతకంగా శిక్షిస్తాడు. అదివరకూ ఎవరూ తనని ఎదిరించలేరన్న ధీమాతో ఉన్న జెడి శివ తెగింపుకి నిశ్చేష్టుడౌతాడు.
 
ఈ అనూహ్య సంఘటన మరో రెండు పరిణామాలకుపర్యవసానాలకి దారి తీస్తుంది. మొదటిది జెడి గణేశ్ ని రంగంలోకి దింపగా, రెండవది స్నేహితులు శివని ఎన్నికలలో నిలబడటానికి ప్రోత్సహించటం. కానీ శివ అర్హుడైన తన సహచరుడు జగన్ ని ఎన్నికల్లో నిలబెట్టమని కోరతాడు. గణేశ్ శివ ప్రయత్నాలని ఆపమని కోరతాడు. కానీ శివ తమ కళాశాల వ్యవహారాలలో వీధి రౌడీల జోక్యం అనవససరమని స్పష్టం చేస్తాడు.
 
గణేశ్ బెదిరించే ప్రయత్నం చేయటంతో శివ అతనికి కూడా దేహశుద్ధి చేయటంతో వ్యవహారం భవానీ దాకా వెళుతుంది. మొదట ఆగ్రహించినా తర్వాత శివలో భవానీ జెడికి ప్రత్యామ్నాయ శక్తిని గమనిస్తుంటాడు. భవానీ జగన్ ని హతమార్చగా శివ ఎన్నికల్లో నిలబడటానికి అంగీకరిస్తాడు.
 
కార్మిక నాయకుడు కృష్ణారెడ్డి ని భవానీ మోసం చేయటంతో అతను శివ పంచనచేరతాడు. శివ అతని బలగాన్ని కోరి అతనికి సాయపడతాడు. శివపై తనకున్న ప్రేమని ఆశ వ్యక్తపరచటంతో వారి వివాహం జరుగుతుంది.
 
శివ పై భవానీ దాడులు మొదలవుతాయి. శివ వాటిని తిప్పికొట్టడంతో బాటు భవానీ బలగాల్ని తన వైపు తిప్పుకొంటాడు. పర్యవసానంగా మాచిరాజు భవానీ కి సహకారాన్ని ఆపుతాడు. దెబ్బతిన్న భవానీ శివ ఇంటిపై దాడి చేస్తాడు.
 
చివరకి జరిగే యుద్ధంలో శివ భవానీని హతమార్చి మహానగరాన్ని ఒక సంఘ వ్యతిరేక శక్తి నుండి కాపాడగా, తన స్వంత అన్న కి ఏకైక కుమార్తె అయిన కీర్తిని ఈ యుద్ధంలో పోగట్టుకొంటాడు.
 
'''సంగీతం - ఇళయరాజా'''
===పాటలు===
'''సంగీతం - ఇళయరాజా'''
 
* ''బోటనీ క్లాసు ఉంది''
"https://te.wikipedia.org/wiki/శివ_(1989_సినిమా)" నుండి వెలికితీశారు