దూకుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==కథ==
అజయ్ ([[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేశ్ ‌బాబు]]) కి చిన్నప్పటినుంచీ దూకుడు ఎక్కువ. అతని తండ్రి ఎమ్మల్యే శంకర నారాయణ ([[ప్రకాశ్ రాజ్]]) చాలా నిజాయితీ పరుడు, స్వర్గీయ ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఆయన తన కొడుకు కూడా తన లాగే ఎమ్మల్యే అయ్యి ప్రజాసేవ చెయ్యాలనుకుంటాడు. ఈలోగా ఆయన ప్రత్యర్ధుల దాడిలో కోమాలోకి వెళ్ళిపోతాడు. దాంతో మహేష్ ప్యామిలీ ముంబైకి షిప్ట్ అయిపోతుంది. అక్కడే మహేష్ పోలీస్ ఆఫీసర్ గా ఎదిగి టర్కీ వంటి దేశాలు వెళ్ళి అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూంటాడు. పనిలో పనిగా అక్కడ ప్రశాంతి ([[సమంత]]) తో ప్రేమలో పడిపోతాడు. టర్కిలో పని పూర్తి చేసుకుని వచ్చిన అతనికి పధ్నాలుగు సంవత్సరాల నుండి కోమాలో ఉన్న తండ్రి కళ్లు తెరచినట్లు తెలుస్తుంది. దాంతో అజయ్ అక్కడికి వెళితే డాక్టర్..హటాత్తుగా షాకింగ్ గా ఉండేవేమీ చెప్ప్దద్దంటాడు. అప్పుడు తండ్రిని బ్రతికించుకోవటం కోసం అజయ్ తన తండ్రి కి నచ్చే విధంగా నాటకం ఆడటం మొదలెడతాడు. అందులో భాగంగా తాను ఎమ్మల్యేనని, ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి నమ్మిస్తాడు. మరో ప్రక్క తండ్రిని దెబ్బ కొట్టిన విలన్స్ ను కూడా నాటకం ఆడి నాటకీయంగా తన తండ్రి చేతే ఎలా చంపిస్తాడనేది మిగతా కథ.
 
==నట వర్గం==
"https://te.wikipedia.org/wiki/దూకుడు_(సినిమా)" నుండి వెలికితీశారు