గిడుగు రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==జీవిత విశేషాలు==
1933 లో పర్లాకిమిడి లో జన్మించిన రాజేశ్వరరావు విజయనగరం లో ఎఫ్.ఎ(ఫెలో ఆఫ్ ఆర్ట్స్.. ఇంటర్మీడియట్ సమానార్హత), పర్లాకిమిడి లో బి.ఎ చదివారు. భువనేశ్వర్ లోని ఉత్కళ విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకం పొందారు. చిన్న వయస్సులోనే రాజేశ్వరరావు రాసిన "టార్చి లైట్" అనే కార్డు కథ 1947 , ఆగష్టు 15 నాటి "చిత్రగుప్త" సంచికలో ప్రచురితమైంది. దాదాపు ముప్పై కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. "రాగిరేకు" , "విషవలయాలు" , "కర్మయోగులు" కథలకు వివిధ పత్రికల్లో బహుమతులు వచ్చాయి. పలు నవలలు, కథలు, శతకాలు, పద్యాలు రచించారు. తాత గిడుగు రామ్మూర్తి పం'తులు జీవిత విశేషాలు "ఉదాత్త చరితుడు" అన్న పుస్తకంలో పేర్కొన్నారు. ఆ పుస్తకాన్ని ప్రముఖ రచయిత డా. [[సి.రారాయణరెడ్డి]] 2012 లో ఆవిష్కరించారు. ఎంతో కష్టపడి శ్రమకోర్చి సేకరించిన సమాచారంతో తాత జీవిత చరిత్రను తీసుకొచ్చారు. భావవీచికలు, పిల్లలకు పిట్టకథలు, పూలతేరు,అమూల్య క్షణాలతోపాటు వివిధ లలిత గీతాలు, మరెన్నో కథలు రచించారు. హైదరాబాద్ లో ఎ.జి. కార్యాలయ సిబ్బంది స్థాపించిన రంజని సంస్థ అధ్యక్షునిగా కొంతకాలం వ్యవహరించారు. ఆయన రచించిన చిన్నపిల్లల పాటలు, కథలు, ఆకాశవాణిలో ప్రత్యేకంగా ప్రసారమయ్యేవి. సరళ హృదయం, సాధుస్వభావం, సౌజన్యశీలం, మితభాషిత్వం, ఆయన ఉదాత్త వ్యక్తిత్వ లక్షణాలు.
 
జీవితాన్ని ఉన్నదున్నట్లుగా దర్శించి దర్శించినదాన్ని అక్షరబద్దం చేసి పాఠకుల కళ్ల ముందుంచేందుకు రాజేశ్వరరావు తన కథల ద్వారా విశేష కృషి చేశారు. అనుభవాల్లోంచి అక్షరాల ద్వారా మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. సమకాలిక జీవితాన్నీ, సమస్యల్నీ అనేక కోణాల్లోంచి విశ్లేషించి, కనీసం ఆటు దృష్టి నిలిపి ఆలోచింపజేసే కథలు రాయాలని, ఆ లక్ష్యం వేపు నడవాలనేది రాజేశ్వరరావు కోరిక. స్పష్టంగా, తేలికగా, సూటిగా చెప్పడంలోనే పాఠకుల హృదయానికి సన్నిహితంగా వెళ్లవచ్చని తన కథలలో నిరూపించారు. బాల్యం నుంచి ఆయనపై ప్రభావితం చేసిన మహానుభావులెంతో మంది ఉన్నా... మొట్టమొదటగా ఆయన్ను ఆకట్టుకున్న కథలు టాల్‌స్యాయివే.