ఎలుగుబంటి వేషాలు: కూర్పుల మధ్య తేడాలు

చి కొన్ని చిన్న చిన్న పదాల వ్యాకరణను సవరించడం జరిగింది.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
; ఎలుగుబంటి, ఎలుగుబంటి వేషాలూ:
[[File:Bear 1.JPG|thumb|right|ఎలుగుబంటి]]
దసరా ఉత్సవాల ఆ తొమ్మిది రోజులూ రకరకాల వేషాలను ప్రదర్శిస్తారు. అలాగే సంక్రాంతి దినాలలో కూడ విచిత్ర వేషాలను ధరించి ఇంటింటికి తిరిగి ప్రజలనానంద పరిచి, వారి నుండి ధాన్యాన్నీ, డబ్బులనూ వసూలు చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వేషాల్లో జంతువులకు సంబందించిన [[పులి]] వేషం పిల్లల్నీ పెద్దల్నీ ఎంతో ఆకర్షింస్తుంది. పిల్లలైతే అసలు దగ్గరకు రారు. అలాగే ఎలుగుబంటి వేషం కూడ. ఆనాటి ప్రజలకు వినోద ప్రదర్శనలు ఇలాంటివే. వీటిని అతి నైపుణ్యంతొ కళాత్మకంగా ప్రదర్శిస్తారు. అలాంటి వేషాల్లో ఎలుగు బంటి వేషం కూడ ముఖ్యమైంది. జంతువుల వేషాలను ధరించిన వారు ఆ జంతువుల యొక్క పోకడలనూ విన్యాసాలనూ, గంతులనూ అరుపులనూ చక్కగా అనుకరిస్తారు.
Line 6 ⟶ 5:
 
అలాగే ఎలుగుబంటి వేషధారులు కూడ నిజమైన ఎలుగుబంటి చేష్టలన్నిటినీ అక్షరాలా అనుకరిస్తారు. నిజమైన ఎలుగు బంటి వెంట్రుకలు జాన పదులకు ఎంతో విలువైనవి. ఆ వెంట్రుకల్ని తాయెత్తులలో చుట్టించి మొలలకు కట్టుకుంటారు పురుషులు. స్త్రీలు ఆ [[తాయెత్తు]]లను [[మంగళ సూత్రం]] త్రాడులో కడతారు. భయపడిన పిల్లలకు తాయెత్తు కట్టితే, చెడు జబ్బులు రావనీ, గాలి చేష్టలు అంటవనీ పెద్దల నమ్మకం. ఎలుగుబంటిని ముఖ్యంగా ఆడించే వారు ఎక్కువ మంది ముస్లింలంటారు ఆర్వీ.యస్ సుందరంగారు .......... [[జానపద విజ్ఞానం]] లో. [[ కర్నాటక]] లో కొడగులో హరిజనులు, ముస్లింలు ఎలుగు బంటి వేషాలు ధరిస్తారట. [[దీపావళి]], వినాయక చవితి, మొహరం వంటి పండదలకు ఈ వేషాలను ధరిస్తారట.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. [[మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి]] గారు రచించిన [[తెలుగువారి జానపద కళారూపాలు]].
==యితర లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఎలుగుబంటి_వేషాలు" నుండి వెలికితీశారు