వేటూరి ప్రభాకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| portaldisp =
}}
'''వేటూరి ప్రభాకరశాస్త్రి''', [[తెలుగు]] కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత మరియు చరిత్రకారుడుతెలుగు, సంస్కృత పండితుడు. చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము ''నాగబు'' అని కనుగొన్నది ఈయనే.సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్త్రి అలాంటి ఓ సాహిత్య చరిత్రకే ప్రకాశం. ఆయన ఒట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ!ఆయన ఒట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు.
 
==జీవిత విశేషాలు==
ప్రభాకరశాస్త్రి, [[కృష్ణా జిల్లా]], [[మోపిదేవి]] మండలములో [[కృష్ణా నది]] తీరమున ఉన్న [[పెదకళ్ళేపల్లి]]లో శ్రీవత్స గోత్రజులైన వేటూరి సుందరశాస్త్రి, శేషమ్మలకు మూడవ సంతానముగా [[1888]], [[ఫిబ్రవరి 7]]న జన్మించాడు. ఈయనకు నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు. తండ్రి సుందరశాస్త్రి [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] వైద్యుడు. ప్రభాకరశాస్త్రి ప్రాథమిక విద్య స్వగ్రామములోనే సాగినది, తండ్రి వద్ద, మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రములను నేర్చుకొన్నాడు. ఉపనయనమైన తర్వాత ప్రభాకరశాస్త్రిని ఆయన తండ్రి శాస్త్రాలు అభ్యసించడానికి [[చల్లపల్లి]]లోని అద్దేపల్లి సోమనాథశాస్త్రి వద్ద చేర్పించాడు.
 
Line 43 ⟶ 44:
 
ప్రభాకరశాస్త్రి, తెలుగులో అనేక కావ్యములు రచించడముతో పాటు అనువాదాలు, వివరణా గ్రంధాలు రచించాడు. ఈయన ప్రాచ్యలిఖిత పుస్తకాలయములో అనేక తెలుగు గ్రంథాలను చారిత్రకాధారములతో సవివరముగా పరిష్కరించి ప్రకటించాడు.
==రచనాశైలి, రచనలు==
పిన్నవయసు శతావధాని, తొలితెలుగు పదం ‘నాగబు’ ఆవిష్కర్త, ‘కలికి చిలుక’ను పలికించిన కథకుడు, ‘కడుపు తీపు’, ‘దివ్యదర్శనం’, ‘మూణ్ణాళ్ల మచ్చట’, ‘కపోతకథ’ వంటి ఖండకావ్యాల విరచితుడు, విమర్శకాగ్రేసరుడు, కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు సంస్కృతీ చరిత్రను దక్షిణదేశమంతటా ఈది మరీ ఒడ్డుకు చేర్చిన సాహిత్య ఘనాపాటి.
* శృంగారశ్రీనాథం
* క్రీడాభిరామం
* బసవపురాణం
* రంగనాథ రామాయణం
* తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్ర
* ప్రాచీనాంధ్ర శాసనములు
* శాతవాహనులు
* ఇక్ష్వాకులు
* రెడ్డిరాజులు
* అన్నమాచార్య కీర్తనలు తొలితెలుగు రచయిత్రి తిమ్మక్క, తొలి తెలుగు శాసనము... ఇవన్నీ, వీరందరూ ఈరోజు మనకందుబాటులో ఉండటానికి ముఖ్యకారకుడు ఈ మహానుభావుడే!
 
==ఇతర విశేషాలు==
* ఈయనకు ఆనందమూర్తి అనే ఒక కుమారుడు కలడు.
==మూలములు==
{{మూలాలజాబితా}}
* తెలుగు వైతాళికులు రెండవ భాగములో వేటూరి ప్రభాకరశాస్త్రిపై ఎన్.సచ్చిదానందం రాసిన వ్యాసం (పేజి.87-104) (ఆంధ్ర ప్రదేశ సాహిత్య అకాడమీ ప్రచురణ.1977)
 
* [http://indianeminentpersons.blogspot.in/search/label/Krushnammal Dr.Seshagirirao వెబ్ సైట్]
[[వర్గం:తెలుగు పరిశోధకులు]]
[[వర్గం:1888 జననాలు]]