దానిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
==పరిచయము==
 
ప్రపంచ వ్యాప్తంగా పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ (Pomegranate) సాగవుతోంది. భారతదేశంలో దానిమ్మ సాగు అన్ని రాష్ట్రాలలో సాగులో ఉంది. దానిమ్మ సాగులో [[మహారాష్ట్ర]] ప్రథమస్థానంలో ఉంది. 2007 సంవత్సరం నాటికి మన రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో సాగవుతూ, 80 వేల టన్నుల దిగుబడి వస్తుంది. మనదేశం నుంచి 4000-5000 టన్నుల దానిమ్మ పండ్లు ఎగుమతి అవుతున్నాయి.
దీని శాస్త్రీయ నామము " punica granatum". పండ్ల జాతులలో మేలైనది . తినడానికి రుచిగా ఉంటుంది . దీనిలో విటమిను -ఎ,సి, ఇ ,బి5, flavanoids ఉన్నాయి .
 
గింజలు ఒలుచుకుని తినడం కొద్దిగా కష్టం కానీ, దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి . పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ " ను చర్మం పై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది . ఈ కిరణల తాకిడివల్ల చర్మం లోని కొలాజెన్‌ తగ్గిపోతుంది . దీని ఫలితంగా చర్మం ముందే వార్ధక్యా నికి లోనై ముడతలు పడుతుంది .
==ఔషద విలువలు==
* అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
 
* దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
 
* ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.
 
* సహజ ఆస్ప్రినే కాదు... దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.
 
* గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం.
 
* వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.
 
* ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
 
* రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం.
 
దానిమ్మ రసము అంగసంభాన సమస్యలను నివారిస్తుంది ... శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది .
 
గుండె (హృదయము) కు మేలు చేస్తుంది .
 
దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్ ' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది .
రక్తపోటును తగ్గించే గుణము దీనికి ఉంది - inhibit the angiotenson converting enzyme .రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది .
 
ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది .
దానిమ్మ గింజల ,నూనె ... రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది .
 
==వారానికోసారి దానిమ్మ రసము :==
 
అధికరక్తపోటు తో బాధపడు తున్నా లేక ట్రైగ్లిసరైడ్స్ 100 దాటి వున్నా లేదా గుండెను కాపాడే ''హెచ్.డి.ఎల్. కొలెస్టిరాల్ '' 50 కన్నా తక్కువగా ఉన్నా... ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడము మంచిది. . గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది . మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మగింజలు నోటిలో వేసుకుని నమలడము కన్న దాన్ని రసము తీసుకొని తాగడము మేలు ... మంచిది .
== దానిమ్మ చెట్టు ==
* ముళ్ళతో ఎదిగే పెద్ద పొద లేదా చిన్న వృక్షం.
Line 33 ⟶ 65:
* పండ్ల నుంచి ద్రాక్ష వైన్స్‌ కంటే మేలైన వైన్‌ తయారు చేయవచ్చు.
 
==మూలాలు==
*https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE&action=edit
[[వర్గం:పండ్లు]]
[[వర్గం:పండ్ల చెట్లు]]
"https://te.wikipedia.org/wiki/దానిమ్మ" నుండి వెలికితీశారు