నారాయణరావు పవార్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
హైదరాబాద్ కు వచ్చింతర్వాత కొంత మంది యువకులను చేరదీసి "యువ క్రాంతి దళ్" ఏర్పాటు చేశారు. దానికి కొండాలక్ష్మణ్ సలహాదారుగా వుండి కొంత ఆర్థిక సహాయం కూడ చేసే వారు. ఆవిధంగా [[ఆర్య సమాజ]] కార్యక్రమాలలో పాలుగొంటూ "లా" కోర్సును కూడ కొనసాగించాడు. 1946 లో ఒక సారి [[దారుసలాం]] మైదానంలో [[మహమ్మదాలి జిన్న]] ప్రసంగాన్ని విన్నాడు. రెచ్చగొట్టే అతని మాటలు జీర్ణించు కోలేక పోయాడు. ఏదైనా సాహసం చేయాలని అపుడే నిర్ణయించు కున్నారు నారాయణరావు మిత్ర బృందం. . కాని ఏది? అనే స్పస్టత లేదు. "లా" కోర్సు లో భాగంలో ప్రతి రోజు హైకోర్టు లో జరిగే వకాలత్ కోర్సులకు వెళ్లే వాడు. ఒక నాడు వకాలత్ కోర్సుకు వెళుతుండగా నారాయణ రావు మిత్రుడు వకాలత్ క్లాసులు ఎలా వుంటాయో చూడాలని వెంట వచ్చాడు. ఆలా వారు వెళు తుండగా [[నయాపూల్ బ్రిడ్జి]] వద్ద పోలీసులు ట్రాపిక్ ను ఆపేశారు. ప్రతి రోజు నిజాము నవాబు దారుల్ షిపా లోని తన తల్లి సమాధిని దర్శించు కోడానికి వెళ్లి వస్తుంటాడు. అసమయాలలో పోలీసులు ట్రాపిక్ ను ఆపేస్తారు. నిలబడి వున్న నారాయణ రావు మిత్రబృందం కారు లో వెళుతున్న [[నిజాము]]ను చూశారు. అప్పుడు మిత్రబృందలోని ఒకడు అనాలోచితంగా, హటాత్తుగా తన మిత్రులతో " [[నిజాము]]ను చంపేస్తె........" అన్నాడు. ఆతరువాత ఆసంగతి ఎవరు మాట్లాడు కోలేదు. కొన్ని రోజుల తర్వాత మితృడు [[బాలకిషన్]] ఆ రోజు అనుకున్నట్లు నిజామును చంపాలని నిర్ణయించు కున్నట్లు నారాయణ రావుకు చెప్పాడు. అందరు సరే ననుకొని ప్రణాళికను రూపొందించు కున్నారు. వీరందరూ [[సుభాష్ చంద్ర బోస్]] ఉపన్యాసాలను శ్రద్దగా చదివేవారు. అందులో అతని నినాదం "మీరు మీ రక్తాన్నివ్వండి..... నేను మీకు స్వాతంత్రం ఇస్తాను... " అన్న మాటలు వీరందరినీ ఉర్రూత లూరించింది. దాంతో మిత్రులందరు ......బాంబులేసి నైజామును చంపాలని....... ప్రాణ త్యాగానికైనా సిద్ద పడాలని నిర్ణయించు కున్నారు.
 
 
నారాయణ రావు, [[పండిత విశ్వనాథ్]] బొంబాయి వెళ్లి బాంబులు కొనాలని బయలు దేరారు. మార్గ మధ్యలో షోలా పూర్ వద్ద [[లక్ష్మణ రావు బాపూజీ]] వీరికి కనబడ్డాడు. అప్పటికే లక్ష్మణ రావు ప్రముఖ క్రిమిల్ లాయరు. బాంబు లెందుకని లక్ష్మణ రావు అడగ్గా/..... రజాకార్లను చంపడానికని అబద్దం చెప్పారు. దాంతో అతను [[నిజాము]]నె ఎందుకు చంప కూడదు? అని సూటిగా అన్నాడు. దాంతో వీరు అసలు సంగతి చెప్పేసారు. దాంతో లక్ష్మణ రావు వీరికి ఆరు వందల రూపాయలిచ్చి జాగ్రత్తలు చెప్పి పంపాడు. బొంబాయిలో రెండు బాంబులు కొని తిరుగు ప్రయాణంలో షోలాపూర్ లో లక్ష్మణ రావును కసిలి రెండు రివ్వలర్లను అడిగి తీసుకున్నారు. బాంబులు విఫల మైతె రివాల్వర్ తో పని కానిచ్చాలని వీరి పథకం. చివరకు మూడు విషం సీసాలను కూడ అడిగి తీసుకున్నారు. మొదటి రెండు పధకాలు విపలమైతే మూడో మార్గంగా విషం తీసుకుని చావలని వీరి పథకం.
 
హైదరాబాద్ వచ్చి వివరంగా ఒక ప్రతిజ్ఞా పత్రాన్ని తయారు చేశారు. వీరు నిజాంను ఎందుకు చంపాలను కున్నది? దాని సారాంశం ఒక పత్రంలో రాసి, ఆరాసిన నకలును నారాయణ స్వామి వద్ద వుంచారు. పథకం అమలు చేసిన రోజు నారాయణ స్వామి బెజవాడ వెళ్లి ఆనకలు పత్రాన్ని, ముగ్గురు మిత్రులు కలిసి తీసుకున్న పోటోను, పత్రికల వారికి, రేడియో వారికి అంద జేయాలని ముందె నిర్ణయించు కున్నారు. ప్రతిజ్ఞా పత్రంపై ముగ్గురు మిత్రులు అనగా నారాయణ రావు పవార్ [[జగదీష్,]] [[గండయ్య]] తమ రక్తంతో సంతకం చేశారు. డిసెంబరు నెల నాల్గవ తారీఖు 1947 సాయంకాలం నాలుగు గంటల సమయం..........[[కింగ్ కోటి]]] రోడ్డు, నిజాం నివాసంముందు. రోడ్డు పై ముగ్గురు మిత్రులు దూర దూరంగా అక్కడక్కడా నిలబడాలి, మొదటి వ్యక్తి విఫలమైతే రెండో వాడు పని కానిచ్చాలి, అక్కడా తప్పితే మూడో వాడు పథకాన్ని అమలు కానివ్వాలి. ఇది వారి పథకం. కింగ్ కోటి రోడ్డులో ప్రతి చౌరస్తా వద్ద ఒక పోలీసు మరొక జవాను వున్నారు. కానిస్టేబుల్ ట్రాపిక్ ను నియంత్రిస్తే జవాను ఆచుట్టు పక్కల తిరుగుతున్న జనాలపై నిఘా పెడుతున్నాడు.
 
నారాయణ రావు గల్లీలోంచి రోడ్డు పైకి వచ్చి తన సైకిల్ ను గోడకు ఆనించాడు. ఇది జవాను గమనించాడు. అప్పటికే నిజాము కారు రెండో కానిస్టేబులు వద్దకు వచ్చింది. ఇంతలో నారాయణరావు సంచిలో నుండి బాంబును బయటి తీసి దాని 'పిన్' లాగి [[నిజాం]] వస్తున్న కారు పైకి విసిరాడు. అది పెద్ద శబ్దంతో పేలి పోయింది. అది పడ్డ ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ముగ్గురు సాధారణ పౌరులు తీవ్ర గాయ పడగా ఒక చిన్న పిల్ల అక్కిడికక్కడే మరణించింది. కారు మాత్రం తప్పించు కుంది. నారాయణ రావు జేబులో చేయి పెట్టి రివాల్వర్ తీసే లోపె జవాను వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు. అతను విషం మింగే అవకాశం కూడ లేదు. బాంబు శబ్దం విన్న మిగతా ఇద్దరు పథకం సఫలం అయిందని అక్కడి నుండి తప్పుకున్నారు. లేక పోతే నిజాముకు ఇదే ఆఖరి రోజు అయ్యెది.
 
"https://te.wikipedia.org/wiki/నారాయణరావు_పవార్" నుండి వెలికితీశారు