గుంటకలగర: కూర్పుల మధ్య తేడాలు

చిత్రమాలిక చేర్చితిని.
చిత్రం
పంక్తి 15:
|synonyms = ''Eclipta erecta''<br />''Eclipta prostrata''<br />''Verbesina alba''<br />''Verbesina prostrata''
|}}
[[దస్త్రం:Kuntagalagara flowers.JPG|thumb|right|కుంటగలగర మొక్క]]
'''గుంటకలగర''' లేదా '''గుంటగలగర''' ఒక విధమైన ఔషధ మొక్క. ఇది [[ఆస్టరేసి]] (Asteraceae) కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ఎక్లిప్టా ఆల్బా (Eclipta alba). నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది. సంస్కృతంలో దీన్ని భృంగరాజ అంటారు. మార్కెట్లో చాలా తల నూనెలు గుంటగలగర ఆకులతో తయారు చేస్తున్నారు. వెంట్రుకలు రాలిపోకుండా కాపాడే గుణం దీనిలో ఉండటమే అందుకు కారణం. గుంటగలగర మొక్కలను వేళ్లతో సహా తీసి శుభ్రపరచి నీడలో ఎండబెట్టాలి. దీనికి మార్కెట్లో మంచి అమ్మకపు విలువ వుంటుంది. ఆధునిక పరిశోధనలలో ఇందులో కల ఎక్లిప్టిన్ అనే ఔషధతత్వానికి లివర్ ను బాగుచేయగల శక్తి ఉందని కనుగొన్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో గుంటగలిజేరును ప్రధానంగా తల వెంట్రుకలు నల్లగా, వత్తుగా పెరగటానికి, లివరు, చర్మ వ్యాధులలో వాడుతారు.
 
"https://te.wikipedia.org/wiki/గుంటకలగర" నుండి వెలికితీశారు