పుష్పగిరి (వైఎస్ఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చిన్న చిన్న దిద్దుబాట్లు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దక్షిణ [[కాశి]]'''గా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి [[కడప]] నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. [[ఆదిశంకరులు]] పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ [[విద్యారణ్యస్వామి]] [[శ్రీచక్రం|శ్రీచక్రాన్ని]] ప్రతిష్టించారు. కడప నుంచి [[కర్నూలు]]కు వెళ్ళే మార్గంలో [[చెన్నూరు]] సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య [[పెన్నా]] నది ప్రవహిస్తుంది.
 
శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. [[వైష్ణవులు]] దీనిని 'మధ్య అహోబిలం' అనీ, [[శైవులు]] దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.
 
 
==పేరు వృత్తాంతం==
ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండేది.గరుత్మంతుడు ఇంద్రుని అమృతభాండాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికీ పోరాటం జరిగింది. ఆ సమయంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి యౌవనం లభించేది, అమరత్వమూ సిద్ధించేది.దేవతలు భయపడి శివుణ్ణి ఆశ్రయించారు.శివుడు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్క ను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలె తేలింది. అదే పుష్పగిరి అయింది.
Line 31 ⟶ 35:
# [[ఖాజీపేట]] నుంచి వయా [[చింతలపత్తూరు]] మీదుగా భక్తులు వచ్చెందుకు వీలుగా వాహనాలు ఎక్కువగా తిరుగుతాయి.
# జాతీయరహదారి పై [[తాడిపత్రి]] నుంచి [[వల్లూరు]] వయా [[ఆదినిమ్మాయపల్లె]] మీదుగా వెళ్లొచ్చు.
 
==బయటి లింకులు==
* http://www.kadapa.info/pushpagiri.html
 
[[వర్గం:కడప జిల్లా పుణ్యక్షేత్రాలు]]